“ కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం ” (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు. (2) ||కొంతసేపు||
ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో. (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు. (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు. ||యేసే||
చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే. (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా. ||యేసే||
నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి. (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా. (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. ||యేసే||