కొనియాడ తరమే నిన్ను

కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను

1.తనరారు దినకరు – బెను తారలను మించు    (2)
ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు.    ||కొనియాడ||

2..కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు.      ||కొనియాడ||

3.సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు.      ||కొనియాడ||

4.విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు.      ||కొనియాడ||

5.దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)
యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు.      ||కొనియాడ||

6.నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ||

7.ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)
శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత.      ||కొనియాడ|| Koniyaada tarame ninnu Komala hrudaya – koniyaada tarame ninnu 1.tanaraaru dinakaru – benu taaralanu minchu (2) Ghana tejamuna noppu – kaantimantuda veevu. ||koniyaada|| 2..kerubulu serupulu – mari doota ganamulu (2) Nurutarambuga goluva – noppu shreshthuda veevu||koniyaada|| 3.sarva lokambula – barvu devuda vayyu (2) Nurvi stree garbhaana – nudbhavinchiti veevu. ||koniyaada|| 4.vishvamantayu nelu – veeraasanuda vayyu (2) Pashvaalito dotti – pandiyuntivi veevu. ||koniyaada|| 5.dosambulanu madiyu – daasaali karuninchi (2) Yesu peruna jagati – kegudenchiti neevu. ||koniyaada|| 6.narulayanduna karuna – dhara samaadhaanambu (2) Chirakaalamunu mahima – paraga jeyudu veevu ||koniyaada|| 7.o yesu paanpuga – naa yaatma jekoni (2) Shreyamuga pavalinchu – shreekara varasuta. ||koniyaada||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు