Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, 3 May 2026

ఏమని వివరింతు నీ ప్రేమ

ఏమని వివరింతు నీ ప్రేమ - ఏమని వర్ణింతు నీ మహిమ


అ.ప. హల్లెలూయ - ఆమెన్ హల్లెలూయ
        యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా


1. యేసు జననమే వసంతమూ యేసులో వేదాంతము (2)
    వేదాంతము - వసంతము ॥హల్లె||


2. యేసు మరణమే నిశాంతమూ యేసులో ప్రశాంతము (2)
    ప్రశాంతము - నిశాంతము II హల్లె II


3. కలువరి యాగమే - లోక కళ్యాణమూ
    సిలువరుధిరమే - పాప పరిహారము-పరిహారము-కళ్యాణము II హల్లె II


4. పునరుత్థానమే ముక్తికి సోపానము
    పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారము - శ్రీకారము -సోపానము II హల్లె II

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు
నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు ॥ఎవరైనా॥


1. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా
  ప్రేమ చూపువారు లేరు లోకమందునా
    నేను కోరుకోకుండా నా కోసము - తనకు తాను చేసినాడు సిలువయాగము


2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
    జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా
    నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము


3. స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
    మేలు చేయువారు ఎవరు విశ్వమందునా
    ఏమి దాచుకోకుండా నా కోసము - ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము

ఎల్లవేళలందు కష్టకాలమందు

ఎల్లవేళలందు కష్టకాలమందు - వల్లభుండా యేసున్ స్తుతింతున్ 

ఎల్లను నీవే నా కెల్లెడల - వల్లపడదే వివరింప IIఎల్లII


1. విమోచకుడా విమోచన నీవే - రక్షకుడవు నారక్షణ నీవే IIఎల్లII


2. సృష్టికర్తవు సహాయము నీవే - ఇష్టుడ నీవు నా త్రిత్వము నీవే    IIఎల్లII


3. జ్ఞానము నీవే నా పానము నీవే- దానము నీవే నా గానము నీవే IIఎల్లII


4. జ్యోతియు నీవే నా నీతియు నీవే - ఆదియు నీవే నా అంతము నీవే IIఎల్లII


5. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే - స్తోత్రము నీవే నా నేత్రము నీవే IIఎల్లII


6. జీవము నీవే నా దేవుడ నీవే పావన నీవే నా కావలి నీవే IIఎల్లII


7. కాంతియు నీవే నా శాంతియు నీవే - సంతసమీవే నా కంతయు నీవే IIఎల్లII

ఎన్ని రోజులగునో

ఎన్ని రోజులగునో - యేసుని సువార్త

అన్ని దేశములకు అందించ ఎన్ని రోజులగునో (2)


1. గొజ్జెలు ఎన్నెన్నో - దారి తప్పుచుండ
    వెదకెడివారలకు నా బలం ధారాళం II ఎన్నిII


2. సాతాను తంత్రములు పెరిగెడి రోజులలో
    దేవుని పిల్లలందు - ఐక్యత కనిపించునా II ఎన్నిII


3. అక్కర పెరుగుచుండ అవకాశము చేజార
    దీనులై సేవకులు - కలిసెడు రోజెపుడో II ఎన్నిII


4. కోపము క్రోధములు విసుకు విభజనలు
    దేవుని సంఘమును - ఎన్నడు విడనాడున్ II ఎన్నిII


5. గోధుమ గింజవలె - మంటిలో మరుగపడి 

   సజీవ క్రైస్తవులు - లేచెడి  రోజేపుడో II ఎన్నిII


ఎంత జాలి యేసువా

ఎంత జాలి యేసువా - ఇంతయని యూహించలేను ||ఎంత॥


1. హానికరుడ హింసకుడను - దేవ దూషకుడను నేను
    అవిశ్వాసినైన నన్ను - ఆదరించినావుగా ॥ఎంత॥


2. రక్షకుండ నాకు బదులు - శిక్ష ననుభవించినావు
    సిలువ యందు సొమ్మసిల్లి చావొందితివి నాకై ||ఎంత॥ 


3. ఏమి నీ కర్పించగలను ఏమి లేనివాడనయ్యా
  రక్షణపు పాత్ర నెత్తి - స్తోత్ర మంచు పాడెద ||ఎంత॥ 


4. నీదు నామమునకు ఇలలో- భయపడెడి వారి కొరకై
    నాధుడా నీవిచ్చు మేలు - యెంత గొప్ప యేసువా ॥ఎంత॥


5. నేను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
    నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చువాడా ప్రభువా ||ఎంత॥

ఎగురుచున్నది విజయ పతాకం

ఎగురుచున్నది విజయ పతాకం - యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యవసములను తీర్చి వేయును - సుఖజీవనం చేయుటకు శక్తి నిచ్చును
రక్తమే రక్తమే రక్తమే యేసు రక్తమే - రక్తమే జయం యేసు రక్తమే జయం


1. యేసుని నామం నుచ్చరింపగనే సాతాను సైన్యము వణకుచున్నది
  వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడి నామము నమ్మినపుడే


2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం- ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
    పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన - క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం


3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా- ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
    నీ పాద పద్మముపై చేరియున్న - ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈక్షణమందే

ఎందుకో ఈ ఘోర పాపిని

ఎందుకో ఈ ఘోర పాపిని - చేరదీసావు ప్రభువా ఏముంది నాలో
'నీ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే
అయిననూ నన్ను కరుణించావు - ప్రేమించావు నన్ను విడిపించావు ॥ఎందుకో||


1. నా అతిక్రమములకై నా పాపములకై గాయాలు పొందినావే

  నా దోషములకై కురూపిగా మారి నీ నోరు తెరువలేదే

నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం

నీ త్యాగమే నన్ను - మురిపించింది (2) ||ఎందుకో||


2. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావా

ఆదరణ కరువై బాధింపబడియూ నీ నోరూ తెరువలేదే

నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం

నీ త్యాగమే నన్ను - మురిపించింది (2) ॥ఎందుకో॥


3. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావా

గుచ్చిరి శిరమున్ ముండ్ల మకుటాన్ని నా కోసం భరియించావా

నీ ప్రేమ మధురం – నీ ప్రేమ అమరం-నీ త్యాగమే నన్నుమురిపించింది

ఎంత మధురమో యేసుని ప్రేమ

ఎంత మధురమో యేసుని ప్రేమ - ఎంత మధురమో నా యేసుని ప్రేమ ||ఎంత॥

ప్రేమా….. ప్రేమా……. ప్రేమా……ప్రేమా……..


1. అంధకార బంధము నన్నావరించగా - అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని
    బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ఎంత॥


2. రక్షించువాడు లేక పక్షినైతిని- భక్షకుడు బాణము గురిపెట్టియుండెను
    బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||ఎంత॥


3. ఎన్నో పాపములు చేసి మూట కడితిని- ఎన్నో మోసములు చేసి దోషినైతిని
    బంధము తెంచెను బ్రతికించెను నన్ను ॥ఎంత॥


4. కుష్టు బ్రతుకు నై నేను - కృంగియుండగా - భ్రష్టుడనైన నన్ను బ్రతికించెనుగా
    బంధము తెంచెను - బ్రతికించెను నన్ను ||ఎంత॥

ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును

1. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతట జాటించుడి


అ.ప      హల్లెలూయ హల్లెలూయ యెంత పాపినైనను
      యేసు చేర్చుకొనున - టంచు బ్రకటించుడి


2. మెండుగా క్షమాపణన్- పూర్ణ సమాధానము
    నెంత పాపికైన దా-నిచ్చి చేర్చుకొనును ॥హల్లెలూయ॥


3. తన దివ్య సిల్వచే- దీసి పాప శాపమున్
    నన్ పవిత్ర పర్చెను - నాకు హయి నిచ్చెను ॥హల్లెలూయ॥


4. ఘోర పాపినైనను - నన్ను చేర్చుకొనును
    పూర్ణశుద్ధి నిచ్చును - స్వర్గమందు జేర్చును ॥హల్లెలూయll

Tuesday, 21 April 2026

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా

ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)

ఆల్ఫాయు నీవే స్తోత్రములు  -  ఓమెగాయు నీవే స్తోత్రములు
ఆదియు నీవే స్తోత్రములు  -  అంతము నీవే స్తోత్రములు….. (2)

పౌలు సీలలు కృంగిన వేళలో  -   ఆధారము నీవైతివి
చెరసాలలో దానియేలు ఉండగా -  ఆధారము నీవైతివి (2)
నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై  నా ఆధారం నీవేగా (2)   IIఆల్ఫాయుII

సంసోనుకు బలము  -  ఆధారమైయున్నావు
సౌలు విజయముకు   -  ఆధారమైయున్నావు(2)
గర్వము అణిచీ గెలుపునిచ్చావు  -  నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ! (2)  IIఆల్ఫాయుII

Sunday, 28 December 2025

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

 "ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా" (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే. (2) ||ఎందుకో||

నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో. (2)        ||ఎందుకో||

నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)       ||ఎందుకో|| 

నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే. (2)     ||ఎందుకో||

నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ .(2)         ||ఎందుకో||


ఎంతో వింత యెంతో చింత

ఎంతో వింత యెంతో చింత-యేసునాధు మరణ మంత-పంతము తో
జేసి రంత-సొంత ప్రజలు స్వామి నంత         ||ఎంతో||

1.పట్టి కట్టి నెట్టి కొట్టి - తిట్టి రేసు నాధు నకటా - అట్టి శ్రమల నొంది
పలుక - డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||

2.మొయ్యలేని మ్రాను నొకటి - మోపి రేసు వీపు పైని - మొయ్యలేక -
మ్రాని తోడ - మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||

3.కొయ్యపై నేసయ్యన్ బెట్టి - కాలు సేతులలో జీలల్ - కఠిను లంత
గూడి కొట్టిరి - ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||

4.దాహము గొన చేదు చిరక - ద్రావ నిడిరి ద్రోహు లకటా = ధాత్రి
ప్రజల బాధ కోర్చి - ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||

5.బల్లెముతో బ్రక్కన్ బొడవన్ - పారే నీరు రక్త మహహా - ఏరై పారే
యేసు రక్త - మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో||

ఎంత మంచి దేవుడవయ్యా

 "ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా" (2)    ||ఎంత||

ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా. (2)    ||ఎంత||

నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా. (2)    ||ఎంత||

నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా. (2)     ||ఎంత||


ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)           ||ఎంత మంచి||

ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)          ||ఎంత మంచి|| సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2)         ||ఎంత మంచి||

ఎండిన ఎడారి బ్రతుకులో

ఎండిన ఎడారి బ్రతుకులో

నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా.    ||ఎండిన||

ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి. (2)
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే.
||ఎండిన||

నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన. (2)
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే.
||ఎండిన||

అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను. (2)
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా.  ||ఎండిన||


ఎవరూ సమీపించలేని

 "ఎవరూ సమీపించలేని

తేజస్సుతో నివసించు నా యేసయ్యా". (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే. (2)
ఏమౌదునో నేనేమౌదునో .(2)

ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి. (2)
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ. (2)    ||ఏమౌదునో||

పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి. (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ . (2) ||ఏమౌదునో||

జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా. (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ . (2)  ||ఏమౌదునో||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...