Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, 23 February 2026

యేసే నా పరిహారి

యేసే నా పరిహారి

ప్రియ యేసే నా పరిహారి

నా జీవిత కాలమెల్ల

ప్రియ ప్రభువే నా పరిహారి (2)   ||యేసే నా||


ఎన్ని కష్టాలు కలిగిననూ

నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)   ||యేసే నా||

నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)    ||యేసే నా||

మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా (2)
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)    ||యేసే నా||

బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా (2)
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)   ||యేసే నా||

దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను (2)   ||యేసే నా||

యేసే నా ఊపిరి – యేసే నా కాపరి

యేసే నా ఊపిరి – యేసే నా కాపరి

నీ సేవే నాకు భాగ్యం

నీ సన్నిధే నాకు శరణం (2)

ఆరాధన ఆరాధన

ఆరాధన ఆరాధన


పాపపు ఊబి నుండి

పైకెత్తిన నా ప్రభువా
చీకటి బ్రతుకునకు
వెలుగైన నా దేవా (2)
నీ ఆత్మయే నాకాదరణ
నిత్య జీవం నా నిరీక్షణ (2)  ||ఆరాధన||

పక్షి రాజు యవ్వనం వలె
నన్ను బలపరచిన దేవా
నూతన దర్శనము
నాకు కనపరచిన ప్రభువా (2)
విశ్వాసమే నాదు సూత్రం
ప్రార్ధనే నాకు విజయం (2)  ||ఆరాధన||

యేసే నా ఆశ్రయము

యేసే నా ఆశ్రయము

యేసే నా ఆధారము

నా కోట నీవే… నా దుర్గము నీవే

నా కాపరి నీవే (2)


శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును (2)  ||యేసే నా||

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును (2)  ||యేసే నా||

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ (2)
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును (2)   ||యేసే నా||

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)

యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)

స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి

ఘనతా బలము కలుగును ఆమెన్ (2)   ||యేసే||


మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)    ||స్తోత్రము||

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)  ||స్తోత్రము||

జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)   ||స్తోత్రము||

యేసూ ప్రభుని స్తుతించుట

యేసూ ప్రభుని స్తుతించుట - ఎంతో ఎంతో మంచిది (2)

1.మహోన్నతుడా - నీ నామమును - స్తుతించుటయే బహు మంచిది (2)

హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా  ||యేసూ ప్రభుని||


2.విలువైన రక్తము - సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)

హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా   ||యేసూ ప్రభుని||

3. ఎంతో గొప్ప - రక్షణనిచ్చి - వింతైన జనముగా మేము చేసెను (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా     ||యేసూ ప్రభుని||

4.మా శైలము - మా కేడెము - మా కోటయు మా ప్రభువే (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా    ||యేసూ ప్రభుని||

5. ఉన్నత దుర్గము - రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడు (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా    ||యేసూ ప్రభుని||

6. అతిసుందరుడు అందరిలోన - అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా     ||యేసూ ప్రభుని||

7. రాత్రింబవళ్లు వేనోళ్లతోను - స్తుతించుటయే బహుమంచిది (2)
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా    ||యేసూ ప్రభుని||


యేసూ… నీకు కావాలని

యేసూ… నీకు కావాలని

నన్ను కోరుకున్నావా (2)

నే ఘోర పాపిని ప్రభువా

ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2)


కలుషాల్ని కడిగిన కరుణామయుడా

కన్నీటి గాథను మలిచావా ప్రభువా (2)
ఈ పేద బ్రతుకును అరచేతులలో
చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా (2)
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2)  ||యేసూ||

దాహముతో ఉన్న నా యేసు ప్రభువా
నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2)
నశియించు ఆత్మల దాహముతో
నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)
నేను నేనే కానయ్యా
నాలో నీవే యేసయ్యా (2)
నీ ప్రేమకుప్పొంగిపోనా
ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2)  ||యేసూ||

యేసూ నన్ను ప్రేమించినావు

యేసూ నన్ను ప్రేమించినావు

పాపినైన – నన్ను ప్రేమించినావు (2)


నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి

దా-నముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2)   ||యేసూ||

తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2)   ||యేసూ||

మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించి-నావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2)       ||యేసూ||

నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2)  ||యేసూ||

నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2)   ||యేసూ||

Sunday, 22 February 2026

యేసు రాజు రాజుల రాజై

యేసు రాజు రాజుల రాజై

త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె

హోసన్నా జయమే – హోసన్నా జయమే

హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||


యోర్దాను ఎదురైనా

ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2)   ||హోసన్నా||

శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2)     ||హోసన్నా||

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2)    ||హోసన్నా||

యేసు రాజుగా వచ్చుచున్నాడు

యేసు రాజుగా వచ్చుచున్నాడు

భూలోకమంతా తెలుసుకొంటారు (2)

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)

రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు||


మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు

పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం   ||యేసు||

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్‌ (2)
వాక్యమే కరువగును    ||యేసు||

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లును (2)
న్యాయమే కనబడును     ||యేసు||

ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
వంగని మోకాళ్ళన్నీ (2)
యేసయ్య యెదుట వంగిపోవును  ||యేసు||

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి (2)
యేసయ్య చెంతకు చేరాలి   ||యేసు||

యేసు రక్తమే జయము జయమురా

యేసు రక్తమే జయము జయమురా

సిలువ రక్తమే జయము జయమురా

ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా

తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2)  ||యేసు||


1.బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే  ||యేసు||

2.పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే   ||యేసు||

యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము (2)

అమూల్యమైన రక్తము

నిష్కళంకమైన రక్తము  ||యేసు రక్తము||


1.ప్రతి ఘోర పాపమును కడుగును

మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2)  ||యేసు రక్తము||

2.మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2)  ||యేసు రక్తము||

3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||


యేసు రక్షకా శతకోటి స్తోత్రం

యేసు రక్షకా శతకోటి స్తోత్రం

జీవన దాత కోటి కోటి స్తోత్రం

యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)

నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)

యేసు ఆరాధించెదను – ఆరాధించెదను


శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు

నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2)   ||యేసు రక్షకా||

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2)   ||యేసు రక్షకా||

యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను||

యేసు మాతో నీవుండగా

యేసు మాతో నీవుండగా

మేము అలసిపోలేమయ్యా (2)

అంతా నీవే చూసుకుంటావు (4)   ||యేసు మాతో||


సమాధానకారకుడు నీవేనయ్యా

సర్వశక్తుడవు నీవేనయ్యా (2)      ||యేసు మాతో||

అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)    ||యేసు మాతో||

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||

యేసు దేవా నను కొనిపోవా

యేసు దేవా నను కొనిపోవా

నీ రాజ్యముకై వేచియున్నా (2)

శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది

శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను

అంత వరకు నీదు శక్తినిమ్మయా

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను

అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము  ||యేసు||


ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది

ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)  ||యేసు||

నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2)
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము
నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను  ||యేసు||

యేసు గొరియ పిల్లను నేను

యేసు గొరియ పిల్లను నేను

వధకు తేబడిన గొరియ పిల్లను (2)

దినదినము చనిపోవుచున్నాను

యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2)  ||యేసు గొరియ||


నా తలపై ముళ్ళు గుచ్చబడినవి

నా తలంపులు ఏడుస్తున్నవి (2)

నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి (2)  ||యేసు గొరియ||


నా చేతుల సంకెళ్ళు పడినవి

నా రాతలు చెరిగిపోతున్నవి (2)
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి (2)  ||యేసు గొరియ||

యేసుతో ఠీవిగాను పోదమా

యేసుతో ఠీవిగాను పోదమా

అడ్డుగా వచ్చు వైరి గెల్వను

యుద్ధనాదంబుతో బోదము  ||యేసుతో||


రారాజు సైన్యమందు చేరను

ఆ రాజు దివ్య సేవ చేయను (2)

యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)
యేసుతో ఠీవిగాను వెడలను   ||యేసుతో||

విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)
అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)
యేసుతో ఠీవిగాను వెడలను    ||యేసుతో||

శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా (2)
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)
యేసుతో ఠీవిగాను వెడలను   ||యేసుతో||

ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2)
సాధనంబెవరు నీవు నేనెగా     ||యేసుతో||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...