కానెన్నడు నేను అనాథను

కానెన్నడు నేను అనాథను

అయ్య కానెన్నడు నేను అనాథను.  (2)

(నా) కన్నీరు తుడచువాడా

నేనున్నానని అనువాడా.  (2)  ||కానెన్నడు||

అమ్మ నాన్న దూరమైనా
బంధువులే వెలివేసినా.  (2)
నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
నా తోడు నీడ నీవే యేసయ్య.  (2)  ||కానెన్నడు||

వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనా.  (2)
నా కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా .  (2)   ||కానెన్నడు||

వ్యాధి బాధలవరించినా
రోగములతో కృంగదీసినా.  (2)
నా వైద్యుడవు నీవే యేసయ్యా
నన్ను స్వస్థపరచువాడవు నీవే.  (2)  ||కానెన్నడు||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో