Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, 4 May 2026

త్రాహిమాం క్రీస్తునాధా

త్రాహిమాం క్రీస్తునాధా – దయజూడ రావే = నేను -  దేహి
యనుచు నీ పాదములే - దిక్కుగా జేరితి నిపుడు llత్రాహిమాంll


1. గవ్వ చెయ్యరాని చెడ్డ - కర్మేంద్రియాధీనుడనై - రవ్వపాలై నే
  నెంతో నెవ్వబొందితి - త్రవ్వుచున్న కొలది -  పెరుగు-దరగదు        
  నా పాపరాశి - యివ్విధమున జెడిపోతి నే - నేమిసేతు - నో హో హో హో


2. నీ యందు భయభక్తులులేని -  నిర్లజ్జా చిత్తము బూని -  చేయరాని
  దుష్కర్మములు - చేసినాడను = దయ్యాలరాజు -చేతిలో-జేయివేసి
  వాని పనుల - జేయసాగి నే నిబ్బంగి - జెడిపోతినే - నయ్యయ్యయ్యో


3. నిబ్బరమొక్కించుకైన- నిజము రవ్వంతైన లేక దబ్బరలాడుటకు
    ము-త్తాతనైతిని = అబ్బురమైన ఘోరపా-పాంధకార
    కూపమందు దబ్బున పడిపోతినయ్యో దారిచెడి నే నబ్బబ్బబ్బా


4. నిన్ను జేరి సాటిలేని - నిత్యానందమంద బోవు - చున్నప్పుడు
    నిందలు నా-కెన్ని చేరినా = విన్నదనము లేకుండ
    నీ-వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించితివి
  నా - యన్న నీకు స్తోత్ర మహాహా

తేనెయకంటెను యేసుని నామం

తేనెయకంటెను యేసుని నామం దివ్య మధురమగును
నీవు పరుగిడి రమ్ము  -  దివ్య సన్నిధికి అనుదినం ఓ మనసా


1. లోకములోన-కష్టములెల్ల యేసుడు - భరియించెన్
  పాప కీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా      ॥తేనియ॥


2. పాపిన్ రక్షింప - ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండు
  ఇది యెంతటి కరుణ నిరంతరముండున్ స్తుతించుము ఓ మనసా    ॥తేనియ॥


3. అరుణోదయమున - మంచువలె ఈ లోకము మాయమగున్
    నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా        ॥తేనియ॥


4. కష్టములోన - సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే
  తన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా            ॥తేనియ॥


5. భూలోక వాసుల్ - పరలోక వాసుల్ ప్రభువును స్తుతియించుడి
  యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు ఓ మనసా          ॥తేనియ॥

తరాలు మారిన యుగాలు మారిన

తరాలు మారిన యుగాలు మారిన -  మారని దేవుడు - మన యేసుడు


1. మారుచున్న లోకంలో -  దారి తెలియని లోకంలో
    మారని దేవుడు - మన యేసుడు ఆ.... ఆ.... ఆ.... ||తరాలు||


2. సూర్య చంద్రులు గతించినా - భూమ్యాకాశముల్ నశించినా
  మారని దేవుడు - మన యేసుడు ఆ... ఆ.... ఆ.... ||తరాలు||


3. నీతి న్యాయ కరుణలో -  నిశ్చలమైన ప్రేమలో
  మారని దేవుడు - మన యేసుడు ఆ... ఆ.... ఆ.. ||తరాలు||


4. నిన్న నేడు నిరంతరం -  ఒకటై యున్న రూపము
    మారని దేవుడు - మన యేసుడు ఆ... ఆ.... ఆ.... ||తరాలు||

తరతరాలలో యుగయుగాలలో

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు (4)     హల్లేలూయా (4)


1. భూమిని సృష్టింపక మునుపు -  లోకపు పునాది లేనపుడు
  దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు llహల్లేll


2. పర్వతములు పుట్టక మునుపు -  నరునికి రూపము లేనపుడు
    దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు ॥హల్లేll 


3. సృష్టికి శిల్వకారుడు జగతికి ఆది సంభూతుడు.
    దేవుడు...... దేవుడు.... యేసే దేవుడు ॥హల్లేll 


4. తండ్రి కుమార ఆత్మలో ఒక్కటైయున్న రూపములు
    దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు ॥హల్లేll

తరతరములలోన - యుగయుగములలో

తరతరములలోన - యుగయుగములలో నీకే స్తోత్రము యేసువా


1. నను గావను నీవే ఓ యేసా -  పరలోకంబును విడచితివా
  దాసుని రూపంబున - సిల్వపై నీవు
  పాప శాపమును మోసితివా llతరతరll


2. నా పాప ఋణంబును - ఓ యేసా ఆ కల్వరి గిరిపై తీర్చితివా
    అంగలార్పును మార్చి రక్షణ వస్త్రము
  నాకు ధరింప జేసితివా llతరతర॥


3. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా -  నేనేమి చెల్లింపగలనయ్యా
    రక్షణ పాత్రంబును చేబూని -  నిత్యము
    అర్పించెదను స్తోత్రమును llతరతరll 

తనువు నాదిదిగో గై

తనువు నాదిదిగో గై-కొనుమీ యో ప్రభువా నీ
పనికి బ్రతిష్ఠించుమీ = దినములు క్షణములు
దీసికొని యవి నీదు - వినతిన్ బ్రవహింప జే  - యను శక్తినీయుమీ ॥తనువు|


1. ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై  -  పనిజేయజేతు
    లివిగో = యనయంబు నీ విషయ-మై సొగసుగా జురుకు -
    దనముతో బరుగెత్త - వినయ పాదము లివిగో ||తనువు||


2. స్వరమిదిగో కొనుమీ -  వరరాజ నిను గూర్చి -  నిరతమ్ము
    పాడనిమ్ము = మరియు పెదవు లివిగో మహనీయమైన
    నీ - పరిశుద్ధ వార్తతో బరిపూర్ణముగ నింపు ||తనువు||


3. వెండిపసిడి యివిగో - వీసమైనను నాకై  - 
  యుండవలెనని కోరను = నిండైన నీ యిష్ట నియమంబు
  చొప్పున - మెండుగ వాడ బరి-మితియౌ జ్ఞానం బిదిగో     ||తనువు||


4. నా యిష్ట మిదిగో యిది - నీ యిష్టముగ జేయ - నా
  యిష్ట మిక గాదది = నా యిచ్ఛ యున్నట్టి - నా
  హృదయమిదిగో నీ-కే యియ్యది రాజ-కీయ సింహాసనమౌ ||తనువు||


5. ఉన్న నా ప్రేమ నీ-సన్నిధానమున నే-నెన్నడు ధారవోయన్ =
  నన్ను నీ వానిగ - నాధా గైకొను మెపుడు చెన్నుగ
  నీ వశమై - స్థిరముగ నుండెద ||తనువు||

తంబుర సితార నాదముతో

తంబుర సితార నాదముతో - క్రీస్తును వేడగా రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననినా స్వామియే


1. పాపులకై దిగివచ్చెనట -  రోగులకే వైద్యుడని
    పాపుల పంక్తిని కూర్చొని ఆ... (2)

    విందులు చేసిన యేసునకే పేదల పాలిటి పెన్నిధికే ||తంబుర||


2. ప్రతి హృదయం ప్రభుమందిరమై -  వెలుగులతో విలసిల్లె ఆ...

   నీ శోధనలను సమిదెలుగా ఆ.... నరకాగ్నిలో పడవేసి
  క్రీస్తును చేరగ పరుగిడవా.... ||తంబుర||


తండ్రి నను పంపినట్లు

తండ్రి నను పంపినట్లు - నేను మిమ్మును పంపుదును (2)
కోత కోయుడి మీరు పొలము చేయుడి


1. కోత విస్తారము కోయువారు - కొందరే కొంతయైన చేయబూని కలసి సాగుడి


2. పొలము పరికించుడి పైరు కూడ సిద్ధమే  - పనలు వంగి తెల్లబారి నేలకొరిగెను


3. సాక్షులై సాగుడి సిలువ శక్తితో శీఘ్రమే  -  సత్యవార్తను సంభ్రమముతో చాటిచెప్పుడి


4. శిష్యులను చేయుడి సర్వ సృష్టినంతటిని -  సర్వకాలము సర్వవేళల మీకు తోడుండును

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...