Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, 3 May 2026

ఉన్నపాటున వచ్చు-చున్నాను

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద - సన్నిధికో రక్షకా =
యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపుపైబడి -
యున్నవిదె నడలేక తొట్రిలు - చున్నవాడను నన్ను దయగను


1. కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
    భూరిదయతో నన్ను నీదరి - జేరరమ్మని పిలుచుటయు ని-
    ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు నాయెడ ॥ఉన్న॥


2. మసిబొగ్గువలె నా మా-నస మెల్ల గప్పె దో - షసమూహములు మచ్చలై
    అసిత మగు ప్రతిడాగు తుడువను - గసటు గడిగి పవిత్ర పరపను
    నసువు లిడు నీ రక్తమేయని మసల కిప్పుడు సిలువ నిదెగని ॥ఉన్న॥


3. వెలుపట బహుయుద్ద-ములు లోపటను భయము కలిగి నెమ్మది దొలగెను 
    పలువిధములగు సందియంబుల వలన పోరాటము లచే నే
    నలసి యిటునటు గొట్టబడి దుర్భలుడనై గాయములతో నిదె ॥ఉన్న॥


4. కడు బీదవాడ నం-ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడియున్నాను
    సుడివడిన నామదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి భాగ్యము
    బడయ వలసిన వన్ని నీచే - బడయుటకు నా యొడయుడా యిదె ॥ఉన్న॥


5. నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి- జీవ మార్గము గంటిని
    కేవలంబగు ప్రేమచేతను - నీవు నన్ను క్షమించి చేకొని
    భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||

6. దరిలేని యానంద - కరమైన నీ ప్రేమ - తరమే వర్ణన చేయను
    తెరవుకడ్డంబైన యన్నిటి - విఱుగగొట్టెను - గాన నేనిపుడరుదుగా
    నీవాడ - నవుటకు - మరి నిజము నీవాడనువుటకే ॥ఉన్న॥

ఉన్నత స్థలములపై

ఉన్నత స్థలములపై - నెక్కించి చూపించు ప్రభో
ఎన్నదగిన మహా రక్షణ శిఖరము సుందరమొందు సదా =


1. మరణము మ్రింగబడి - ఘనవిజయము ప్రాప్తమాయెన్ ఆ.. (2)
    మరణపు ముల్లును విరచి జయంబును-యేసు అనుగ్రహించెను


2. ఎవరి మనస్సు ప్రభుపై- నిశ్చలముగ నిల్చునో ఆ... (2)
    దైవశాంతినొంది క్రీస్తులో నిలచి-సంతసమొందెదరు


3. ఆశ్చర్యకరుడాయనే- ఆలోచనకర్తయును ఆ... (2)
    నిశ్చయముగ బహుబుద్ధి-వివేకము-లిచ్చి నడుపుము సదా


4. చంచల హృదయములును-మూర్ఖులగు పాపులను ఆ... (2)
    వంచన లేక వాక్యమునకు తల-వంచి విధేయులౌదురు


5. కుడికి తిరిగినను - మరి ఎడమకు తిరిగినను ఆ... (2)
    నడుపుడి త్రోవ యిదే యను శబ్దము-చెవులకు వినబడును


6. పక్షిరాజు తన పిల్లల - కాచెడిరీతి ఆ... (2)
    రక్షణకర్త యేసు నన్ను - కాచి రక్షించును సదా


7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు ఆ... (2)
    అందమైన యా పరలోక రాజ్యము-ప్రబలుట చూచెదవు

ఉత్తరదేశం వెళ్ళ మనలో

    ఉత్తరదేశం వెళ్ళ మనలో వీరుడెవరు - పలుదేశాలు పొమ్మని చెప్పెనేసు ॥ఉత్తర॥


1. విశ్వాసులెందరో ఇక్కడ- ఎన్నెన్నో సంఘాలిక్కడ
    ఏమియే తెలియని వారక్కడ - కోట్ల కొలదిగా ఉన్నారు
    ఎవరు లేరు అక్కడెవరు లేరు - యేసుని ప్రకటింప ఎవ్వరు లేరు ||ఉత్తర||


2. సౌఖ్యములలో జీవింప- దక్షిణముననే కూర్చుండక
    అవసరమగు చోటికి వెళ్ళ - యేసురాజు దారిచూపును
    ఇశ్రాయేలూ ఇక ఎన్నాళ్ళు - యెరూషలేం మధ్యలో నే నిలచెదవా II ఉత్తర II


3. నన్నే నీకర్పింతు దేవా నాకై - బలియైతివా నాధా
  చూపించు స్థలముకు పోవ - వెనుకకు తిరుగనీయకు
    అంగీకరించు నన్నంగీకరించు - సాష్టాంగ పడితిని దారిచూపు (2) II ఉత్తర II

ఉన్నతాశయం కావాలి

ఉన్నతాశయం కావాలి నిశ్చయం ఉన్నతాశయం కలిగియుండు నిశ్చయం
క్రొత్త జీవితం సదా జీవితాశయం దైవవాక్యం నెరవేరును సత్యం

దైవరాజ్యం లోకాన కలుగు నిశ్చయం ॥ఉన్నతాశయం||


హమారా వతన్ ఇండియా - సహారా మే ప్యారా మసీ - సహారా మే ప్యారా మసీ


1. దేశం వెదకు యేసుని చూపించెదవా - పాపం వీడి దైవనీతి కోరుకుందువా
    వింతైన మంచిమనసు మనకు లభ్యము - ఇక చింతలేదు జీవితం మనకు సొంతము


2. యేసు వెదకు వ్యక్తి నీవు త్వరగా కదలిరా- నిబంధన చేయ నీవు వేగ కదలిరా
    సంతృప్తి సహితమయిన భక్తి తోడను - నీ జీవితం యేసుకై ఇవ్వ త్వరగా రా

ఉన్నత ఆత్మ నీ బలమిమ్ము

ఉన్నత ఆత్మ నీ బలమిమ్ము లోక ఆశలను జయించవలెన్ (2)
పవిత్రముగానే జీవించవలెను పరలోక రాజ్యము చేరువరకు (2)


1. పరలోక మన్నాను ప్రతి దినమిమ్ము అరణ్యదాహము తీర్చగ రమ్ము (2)
    గోధుమ గింజగ భూమిలో పడినే ప్రాణార్పణముగ పోయబడెదన్ (2) || ఉన్నత ||


2. నను పిలిచితివి నా యోగ్యత నీవే నీలో నేనొక యుద్ధాయుధమే (2)
  నీ శక్తితో వైరి నెదిరించెదను - నీ జయధ్వనితో నే మరలెదను (2) II ఉన్నత II

ఉన్నట్టు నేను వచ్చెదన్

1. ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపిష్టు న్నీవు పిల్వగన్
    నీ నెత్రుచేత గడ్గుమా యో గొట్టెపిల్ల దేవుడా !


2. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
    నీ మాటతో హరించుమా - యో గొట్టె పిల్ల దేవుడా !


3. ఉన్నట్టు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపర్చగన్
    బాపంబు జేయనీకుమా యో గొట్టె పిల్ల దేవుడా !


4. ఉన్నట్టు నేను వచ్చెదన్- యేసూ, కబోది నుండగన్
  ఆత్మీయదృష్టి నీయుమా యో గొట్టె పిల్ల దేవుడా !


5. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీమాట నమ్మునట్టి నన్
    మన్నించి చేర్చుకొమ్మయా యో గొట్టెపిల్ల దేవుడా !

6. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను బిల్వగన్
    నీ వాడ నౌదు సర్వదా యో గొట్టె పిల్ల దేవుడా !

Wednesday, 18 March 2026

ఉజ్జీవము రావాలి - నిజజీవము కావాలి - నిర్జీవము పోవాలి

   ఉజ్జీవము రావాలి  -  నిజజీవము కావాలి  -  నిర్జీవము పోవాలి


1. నిజ భక్తులు లేవాలి నజరేయుని సేవింప  -   విజయుండగు ప్రభుకొరకై
    ధ్వజమెత్తుకు నడవాలి నిజభక్తులు లేవాలి  -   నజరేయుని సేవింప  ॥ఉజ్జీవ॥

2. త్యాగముతో రావాలి లోకాశలు చావాలి  -  ఆనురాగం కావాలి
  అందరికై ప్రార్ధింప త్యాగముతో రావాలి   -   లోకాశలు చావాలి     ॥ఉజ్జీవ॥

3. భారముతో సాగాలి  - సువార్తను చాటాలి  - మరణించెడి పాపులకై
  కరుణించగ రావాలి  -   భారముతో సాగాలి  -  సువార్తను చాటాలి   ॥ఉజ్జీవ॥


4. వేదనతో లేవాలి  -  బాధితులను విడిపింప  -   బ్రతుకంతా ప్రభుకొరకై
    తుదివరకు నిలవాలి  -  వేదనతో లేవాలి   -  బాధితులను విడిపింప   ॥ఉజ్జీవ॥

5. మోకాళ్ళను వంచాలి- మనసంతయు నిలపాలి- ప్రభుయేసుని రక్తములో
    పరిశుద్ధులు కావాలి - మోకాళ్ళను వంచాలి  - మనసంతయు నిలపాలి ॥ఉజ్జీవ॥

6. ప్రాణాత్మలు వంచాలి  -  ప్రార్ధనకై రావాలి  -  ప్రాపంచిక కోరికలు
    ప్రభుకొరకై విడవాలి  -  ప్రాణాత్మలు వంచాలి  -  ప్రార్ధనకై రావాలి    ॥ఉజ్జీవ॥

Sunday, 28 December 2025

ఉత్సాహ గానము చేసెదమ

 "ఉత్సాహ గానము చేసెదము

ఘనపరచెదము మన యేసయ్య నామమును" (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్. (2)

అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి. (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము. (2)    ||హల్లెలూయ||

వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన. (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము. (2)     ||హల్లెలూయ||

ఉదయకాలము మధ్యాహ్నము

 "ఉదయకాలము మధ్యాహ్నము

సాయంకాలము చీకటి వేళలో" (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు. (2)

లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును. (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు. (4)


Tuesday, 23 December 2025

ఉతక మీద తలుపు తిరుగు రీతిగా

 ఉతక మీద తలుపు తిరుగు రీతిగా

తన పడక మీద సోమరి తిరుగాడును

గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా

సోమరి చుట్టూ లేమి తిరుగును

సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో (2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో. (2)  ||ఉతక||

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు. (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును. (2)   ||సోమరీ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు. (2)
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును. (2)   ||సోమరీ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా. (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును. (2)    ||సోమరీ||

తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును. (2)
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును. (2)    ||సోమరీ||

ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో. (2)
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది. (2)   ||సోమరీ||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...