Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Wednesday, 18 March 2026

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా

  ప్రార్ధన వినెడి పావనుడా  -  ప్రార్ధన మాకు నేర్పుమయా


1. శ్రేష్టమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
    పరముడ నిన్ను - ప్రణుతించెద ప్రియముగ - పరలోక ప్రార్ధన నేర్పుమయా   ॥ప్రార్ధన॥


2. పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగమోడ్చి = శిరమును
    వంచి సరిగను వేడిన   - సుంకరి ప్రార్ధన నేర్పుమయా    ॥ప్రార్ధన॥


3. దినదినంబు చేసిన సేవ  -  దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
    ఒంటిగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా             ॥ప్రార్ధన॥

4. శత్రుమూక నిను చుట్టుకొని  -  సిలువపైని నిను జంపగను 

    శాంతముతో శరణని వేడిన గెత్సెమనె ప్రార్ధన నేర్పుమయా    ॥ప్రార్ధన॥

ప్రార్థించు యోధులు లేవాలి - ప్రార్థించి ఆత్మల గెలవాలి

  ప్రార్థించు యోధులు లేవాలి  - ప్రార్థించి ఆత్మల గెలవాలి
      సడలిన మోకాళ్ళు బలపరచి  -  ప్రార్ధించు వరమును పొందాలి.


1. అహమును ప్రభుకు లోబరచి  -  దీనమనస్సును ధరియించి
    యేసుని చెంత కూర్చుంటే దేశం క్షేమం పొందునులే      ॥ప్రార్థించు॥    


2. వేకువ ప్రార్ధన శక్తినొంది  -   విజ్ఞాపనలు అధికం చేసి
    దేశము నాశనమగుచుండ  -  ఆసక్తితో ప్రార్దించెదము   ॥ప్రార్థించు॥ 


3. బండ సందులలో నిలుచువాడు  -   ధైర్యముగా ప్రకటించునట్లు
    ఉజ్జీవజ్వాలలు ఆరకుండ - ప్రార్థించి దేశాన్ని అలంకరిద్దాం    ॥ప్రార్థించు॥ 

ప్రార్థన చేసెదము కన్నీరు కార్చెదము దేశపు క్షేమముకై

  ప్రార్థన చేసెదము కన్నీరు కార్చెదము దేశపు క్షేమముకై
          ప్రార్థించి జయమొందెదం వేకువ జామున, రాత్రికాలమున
          పగలు, రాత్రి  ఎడతెగక  -  ఎల్లప్పుడెల్లపుడు

1. ప్రార్థించిన   - సాతాను పారిపోవున్  -  ప్రార్ధించిన ఎదురింపులణగిపోవున్
    ప్రార్థన ప్రార్థనయే ... ప్రార్ధన ప్రార్ధనయే…….. (2)

   వేడెదం  ఇచ్చెదం  త్వరపడి  కృషిచేసెదం   (2)    (మనం)    ॥ప్రార్థన॥  2. గంగలో - మునిగెడువారదిగో  -  పుణ్యక్షేత్రాలకు వెళ్లెడి వారదిగో

    దుఃఖించు వారెవరు - వీరికై విలపించు వారెవరు
    ఎవరు ఎవరు మనలో వారెవరు      (2)     (ఎవరు)        ॥ప్రార్థన॥

3. దైవాత్మతో అనుదినం ఎదిగెదము   -  దైవకృపలో ముందుకు సాగెదము
    ప్రార్ధన ప్రార్ధనతో ప్రార్ధన ... ప్రార్ధనతో

    దేశమును మన స్వాస్థ్యముగా పొందెదం    (2)   (మన)    ॥ప్రార్థన॥

Sunday, 22 February 2026

ప్రేమించెదన్ అధికముగా

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)

ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే  || నిన్ను పూర్ణ ||

ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా   || నిన్ను పూర్ణ ||

యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా     || నిన్ను పూర్ణ ||

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది

ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ  ||ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును       ||ఎన్నడెన్నడు||

భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును  ||ఎన్నడెన్నడు||

బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును   ||ఎన్నడెన్నడు||

ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును  ||ఎన్నడెన్నడు||

ప్రియ యేసు నిర్మించితివి

ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా
హృదయాంతరంగమున

నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి (2)   ||ప్రియ యేసు||

అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి (2)        ||ప్రియ యేసు||

వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి
కోరి నడిపించుము (2)       ||ప్రియ యేసు||

ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా (2)    ||ప్రియ యేసు||

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||

జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||

ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||

ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||

ప్రార్ధన యేసుని సందర్శన

ప్రార్ధన యేసుని సందర్శన
పరమ తండ్రితో సంభాషణ

కరములెత్తి ప్రార్ధించగా
పరమ తండ్రి కౌగిలించును
స్వరమునెత్తి ప్రార్ధించగా
మధుర స్వరముతో మాటాడును  ||ప్రార్ధన||

తండ్రి అని నే పిలువగా
తనయుడా అని తా బల్కును
ఆదుకొనును అన్ని వేళలా
కన్నీరంతయు తుడిచివేయున్  ||ప్రార్ధన||

మోకరించి ప్రార్ధించగా
సమీపముగా వేంచేయును
మనవులెల్ల మన్నించును
మహిమతో నలంకారించును   ||ప్రార్ధన||

కుటుంబముతో ప్రార్ధించగా
కొదువ ఏమియు లేకుండును
ఐక్యతలో నివసించును
శాశ్వత జీవము అచటుండును   ||ప్రార్ధన||

సంఘముగను ప్రార్ధించగా
కూడిన చోటు కంపించును
పరిశుద్ధాత్ముడు దిగివచ్చును
ఆత్మ వరములతో నింపును     ||ప్రార్ధన||

ఉపవాసముతో ప్రార్ధించగా
కీడులన్నియు తొలగిపోవును
కొట్లు ధాన్యముతో నింపును
క్రొత్త పానము త్రాగించును      ||ప్రార్ధన||

ఏకాంతముగా ప్రార్ధించగా
నీతిని నాకు నేర్పించును
యేసు రూపము నాకిచ్చును
యేసు రాజ్యము నను చేర్చును   ||ప్రార్ధన||

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||

సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||

ప్రార్థన వినెడి పావనుడా

ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా  ||ప్రార్థన||

శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా   ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా  ||ప్రార్థన||

దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా   ||ప్రార్థన||

శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా  ||ప్రార్థన||

ప్రభు యేసు నా రక్షకా

  ప్రభు యేసు నా రక్షకా  -  నొసగు కన్నులు నాకు  నిరతము
  నే నిన్ను జూడ (2)  అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)   ||ప్రభు యేసు||

1. ప్రియుడైన యోహాను పత్మాసులో  -  ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

2. లెక్కలేని మార్లు పడిపోతిని  -  దిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచి  -  గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)    ||ప్రభు యేసు||

3. ఎరిగి యెరిగి నే చెడిపోతిని  -  యేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితి  -  దాసుడ నన్ను జూడనిమ్ము (2)  ||ప్రభు యేసు||

4. ఎందరేసుని వైపు చూచెదరో  -  పొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచు  -  ముందుకు పరుగెత్తెదరు (2)   ||ప్రభు యేసు||

5. విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ  -  కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచు  -  విసుగక పరుగెత్త నేర్పు (2)  ||ప్రభు యేసు||

6. కంటికి కనబడని వెన్నియో  -  చెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియో  -  సిద్ధపరచితివ నాకై (2)      ||ప్రభు యేసు||

7. లోక భోగాలపై నా నేత్రాలు  -  సోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమును  -  నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం   ||ప్రభు యేసుని||

దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు     ||ప్రభు యేసుని||

యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)
ఈడేరెను నా వినతి         ||ప్రభు యేసుని||

పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు   ||ప్రభు యేసుని||


ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం   ||ప్రభు యేసుని||

దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు  ||ప్రభు యేసుని||

యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)
ఈడేరెను నా వినతి  ||ప్రభు యేసుని||

పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||

ప్రభు యేసుని పూజించెదం

ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం (2)
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)
సంతోషముగా ఉండెదం (4)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు||

జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు (2)
మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా||

ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి (2)
ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా||

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)

నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3)   || ప్రభుని ||

ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3)  || ప్రభుని ||

పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3)  || ప్రభుని ||

మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3)    || ప్రభుని ||

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)

పరమును విడచి పాకలో పుట్టిన

పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)   ||బాలుడు||


కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)   ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)   ||బాలుడు||

పైలం కొడుకా పాపం చేయకురా

పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా


ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది
పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది
పాపమన్నది పాములాంటిది
పగ పడ్తది ప్రాణం తీస్తది  ||పైలం||

మనిషి జీవితం విలువయ్యింది
మరువకు కొడుకా మరణమున్నదని
బ్రతికింది ఇది బ్రతుకు కాదురా
సచ్చినంక అసలాట ఉంటది   ||పైలం||

కత్తి కన్న పదునెక్కువ కొడుకా
మనిషి కోపము మంచిది కాదు
కాలు జారితే తీసుకోవచ్చురా
నోరు జారితే తీసుకోలేము    ||పైలం||

క్రైస్తవ జీవితం విలువయ్యింది
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిందలన్ని మొయ్యాలిరా కొడుకా   ||పైలం||

విచ్చలవిడిగా తిరుగుతున్నావు
ఎవరు చూడరని ఎగురుతున్నావు
చూసే దేవుడేసయ్య ఉన్నడు
తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా ||పైలం||

గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు
పొగాకు తినకురా పోతవు నరకం
సినిమా చూడకు చింతలు తప్పవు
ఫోజులు కొట్టకు పోతవు నరకం  ||పైలం||

కుమ్మరి పురుగు గుణం చూడరా
బురదల ఉంటది బురదే అంటదు
తామెర పువ్వు బురుదల ఉంటది
వరదొస్తే తల వంచుకుంటది    ||పైలం||

ఎన్నో ఆశలు పెట్టుకున్నరా
సేవ చేస్తే నిను చూడాలని
నా కలలను కల్ల చెయ్యకు కొడుకా
కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా   ||పైలం||

పొందుకున్నవు రక్షణ నీవు
పోగొట్టుకోకు పోతవు నరకం
నరకమంటే ఆషామాషీ కాదురో
అగ్ని ఆరదు పురుగు చావదు    ||పైలం||

ప్రపంచమంతటా పాపమున్నది
మందులేని మాయ రోగమున్నది
నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా
నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా

నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు
యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు
నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా
నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా   ||పైలం||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...