"Telugu Christian songs lyrics collection. Jesus worship songs, devotional songs, gospel songs, praise songs and Telugu Christian song lyrics for all occasions."
నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా (2) నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||
నా శాపము తొలగించినావు నా దోషము భరియించినావు (2) నాకు జీవం మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) యేసయ్యా యని విలపించగా నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||
హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||