ఊ హించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం (2)
వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్ (2)
1. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా (2)
యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా (2)
2. మేలుతో నా హృదయం తృప్తి పరిచినావు - రక్షణ పాత్ర నిచ్చి నిన్ను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ (2)
3. నా దీన స్థితిని నీవు మార్చినావు - నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపతో నన్ను ఆవరించినావు - నీ సన్నిధి నాకు తోడు నిచ్చినావు (2)