కంటి పాపను కాయు రెప్పలా
కంటి పాపను కాయు రెప్పలా - నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా - దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా - నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా - నాకు నీవే చాలయ్యా. ||కంటి||
1.మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ - ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ -
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ . ||కంటి||
2.ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ - ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ -
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. ||కంటి||
Kanti paapanu kaayu reppalaa - nanu kaachedi yesayyaa
Chanti paapanu saaku ammalaa - daachedi maa ayyaa
Neevegaa needagaa todugaa - neetone nenunoo jeevintu
Neekannaa minnagaa evarayyaa - naaku neeve chaalayyaa. ||kanti||
1.maarpuleni matsarapadani prema choopinchinaavu
Deergha kaalam sahanamu choope prema nerpinchinaavu
Idi evaroo choopinchani prema - idi laabham aashinchani prema
Idi evaroo edabaapani prema -
Idi maranam varaku karunanu choopina prema . ||kanti||
2.dhambamu leni haddulerugani prema kuripinchinaavu
Nirmalamaina nissvaardhya premanu maapai kuripinchinaavu
Idi evaroo choopinchani prema - idi laabham aashinchani prema
Idi evaroo edabaapani prema -
Idi maranam varaku karunanu choopina prema. ||kanti||
Comments
Post a Comment