"Telugu Christian songs lyrics collection. Jesus worship songs, devotional songs, gospel songs, praise songs and Telugu Christian song lyrics for all occasions."
ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా పరలోక సంతోషం దేవుడిచ్చును (2) పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2) ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ||
అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు అడిగి చూడుము (2) సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2) అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||
నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||
పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2) పాపంలో నుండి నను విమోచించుటకు ఆ ఘోర సిలువలోన మరణించావు దాస్యములోనుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప||
మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2) ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా ||మా గొప్ప||
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2) మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2) మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని||
నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2) నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2) నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2) ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము||
ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2) దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము (2) ||మార్గము||
దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2) దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2) ||మార్గము||
అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2) అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము||
కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు (2) కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము (2) ||మార్గము||
నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2) నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2) ||మార్గము||
ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2) క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా||
జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2) ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా||
నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2) నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) ||మనిషిగా||