కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం    (2)
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు.  (2)  ||కొంతసేపు||

1.ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో.  (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు.  (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు.     ||యేసే||

2.చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా.  (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే.  (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా.   ||యేసే||

3.నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి.  (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా.  (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా.    ||యేసే||


Kontasepu kanabadi antalone maayamayye Aaviri vantidiraa ee jeevitam Lokaana kaadedi shaashvatam (2) Yese nija devudu nityajeevamistaadu Maranamaina jeevamaina ninnu viduvadu. (2) ||kontasepu|| 1.edurautaarendaro nee payananlo Nilichedi endaru nee akkaralo. (2) Vachchedevaru neeto maranamu varaku. (2) Ichchedevaru aapai nitya jeevamu neeku. ||yese|| 2.chematodchi sukhamu vidichi kashtamunorchi Aastulu sampaadinchina shaanti unnadaa. (2) Ee raatre devudu nee praanamadigite. (2) Sampaadana evaridagunu yochinchitivaa. ||yese|| 3.nee shaapam taanu mosi paapam teesi Rakshana bhaagyamu neekai siddhamu chesi. (2) Vishraantineeyaga ninnu piluvagaa. (2) Nirlakshyamu chesina tappinchukonduvaa. ||yese||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు