చేకొని రండి - చేకొని రండి- నా ప్రజలను నాచెంతకు - చేకొని రండి
ఓదార్పు నిత్తును - ఆశీర్వదింతును - నన్ను కోరువారినెల్ల - చేకొని రండి
అ.ప శుద్ధి గోరు పాపులను చేకొని రండి
కడుగుదును నా రక్తముతో చేకొని రండి
దప్పిగొన్న వారినెల్ల - చేకొని రండి
పాపం తొలగ - సిలువ దరికి చేకొని రండి
1. మతము కాదిది - హృదయ మార్పిడి మార్పుకోరు ప్రజల నెల్ల
చేకొని రండి నా రాకడ వరకు - సిలువ ప్రేమలో
నిలచి ఉండు వారినెల్ల చేకొని రండి ॥శుద్ధిll
2. నన్ను చూచిన - తండ్రిని చూచినట్టే నిరాశ పడిన వారినెల్ల
చేకొని రండి ఎవరు వచ్చిన త్రోసివేయను
నన్ను కోరు వారినెల్ల చేకొనిరండి ॥శుద్ధిll
3. నమ్మకమైన ఓ సంఘమా నీ కప్పగింపబడినపనికై పరుగులెత్తుమా
కోత ఎక్కువ - పనివారు తక్కువ వ్యవధి లేదు వేగిరమే - చేకొని రండి ॥శుద్ధిll