Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, 3 May 2026

ఏలీయా దేవుడు

ఏలీయా దేవుడు - మన దేవుడు-బలమైన దేవుడు - మన దేవుడు
దాసులెల్ల ప్రార్థించగా - అద్భుతములను చేయు దేవుడు


అ.ప. యేసే ప్రభువు - యేసే దేవుడు యేసే రక్షకుడు (2)


1. భక్తుని ప్రార్ధన జవాబుగ - వర్షమునాపిన మన దేవుడు
    విధవరాలి గృహమందు - సమృద్ధి నిచ్చిన మన దేవుడే II యేసే II


2. శత్రువు ఎదురై భయపెట్టగ - అభయమునిచ్చిన ఆ దేవుడు
    అగ్ని ద్వార జవాబునిచ్చి- నడిపించెనుగ మన దేవుడే ॥యేసే॥


3. దైవజనులు దేవుని యెదుట కూడిరాగ - బలిపీఠం బలులతోనిండి
  యుండగ - ఆ క్షణమే ప్రార్థించగ - ప్రార్ధన వినిన మన దేవుడే ॥యేసే॥


4. ఆకాశము తెరచి ఆ దేవుడు - వర్షమునంపి తృప్తిపరచే
  తన వారిని ఆశీర్వదించి - కాపాడె దేవుడు మన దేవుడే II యేసే II


ఏరీతి స్తుతియింతునో

ఏరీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో 

నేరము లెంచని వాడ నాడు నజరేయుడా

  తీరము దాటినవాడ నాదు గలిలేయుడా


అ.ప. నా ప్రాణ నాధుండా - నీదు ప్రాణమిచ్చితివి
        నేను నీ వాడనో యేసువా (2)


1. వెదకి నన్ను ఇలా చేరితివి - వెంబడింపగ పిలిచితివి
    రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగా జేసితివి ॥నా ప్రాణ॥


2. మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి
      సకల సంపద విడచితివి  - సేవకునిగా మారితివి ॥నా ప్రాణ॥


3. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా
    ఎన్నతరమా నీ ప్రేమా - సన్నుతింతును సాగెదను ॥నా ప్రాణ॥


Sunday, 28 December 2025

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)

ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా. ||ఏ సమయమందైనా||

చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఏదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ
యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే.  ||ఆరాధనా||

నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
అల్ఫా ఒమేగా ఆది దేవునికే.  ||ఆరాధనా||


ఏరీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా

ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా

ఎంతో కృపను చూపి దీవించినావయ్యా.    ||ఏ రీతి||

పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)

పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా.||ఏ రీతి||

నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)

నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా.  ||ఏ రీతి||


ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా

 ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా

నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా.

ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా. ||ఏ పాప||

కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా. ||ఏ పాప||

చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా. ||ఏ పాప||

ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా. ||ఏ పాప||

పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా. ||ఏ పాప||

బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము. ||ఏ పాప||

కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి. ||ఏ పాప||

Friday, 26 December 2025

ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు

ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. (2)

నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. (2)
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది.       ||ఏపాటి||

కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు. (2)
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా.       ||ప్రేమించే||

నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా.       ||ప్రేమించే||


Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...