Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, 22 February 2026

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు

భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు

దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)

ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా

దేవుని దృష్టిలో అందరు పాపులే (2)   ||భేదం||


ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2)    ||భేదం||

పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము (2)     ||భేదం||

భూమియు దాని సంపూర్ణత లోకము

భూమియు దాని సంపూర్ణత లోకము

దాని నివాసు లెహోవావే (2)


ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2)   ||భూమియు||

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు||

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2)  ||భూమియు||

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2)   ||భూమియు||

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2)   ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2)  ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2)   ||భూమియు||

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే

ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే    ||భీకరుండౌ||


మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము  || భీకరుండౌ ||

ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము  || భీకరుండౌ ||

పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని         || భీకరుండౌ ||

మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను   || భీకరుండౌ ||

మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను       || భీకరుండౌ ||

భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా   ||భాసిల్లెను||

1.కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)   ||భాసిల్లెను||

2.దోషము చేసినది నేనెకదా - మోసముతో బ్రతికిన నేనె కదా
మోసితివా నా శాపభారం (2)   ||భాసిల్లెను||

3.పాపము చేసి గడించితి మరణం - శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)  ||భాసిల్లెను||

4.నీ మరణపు వేదన వృధా గాదు - నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||

5.ఎందులకో నాపై ఈ ప్రేమ - అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
6.నమ్మిన వారిని కాదన వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2)  ||భాసిల్లెను||

భారత దేశమా యేసుకే

భారత దేశమా యేసుకే

నా భారత దేశమా ప్రియ యేసుకే (2)

నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన

నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)

యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి

పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)

భారత దేశమా నా భారత దేశమా

నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి

భారత దేశమా నా భారత దేశమా

ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి


సృష్టికర్తనే మరచి – భారత దేశమా
సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా (2)
ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా
నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా
శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా (2)
లోకమంతయు లయమైపోవును – భారత దేశమా
లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా
పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా (2)
యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా
యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

భారత దేశమా నా యేసుకే
భారత దేశమా ప్రియ యేసుకే (2)
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4)   ||భజియింతుము||

రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
సుందరుడగు యేసు నామం (2)
స్తుతించి భజించి పాడెదము      ||భజియింతుము||

పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
పాపముల వీడి యేసుని (2)
స్తుతించి భజించి పాడెదము      ||భజియింతుము||

భక్తులారా స్మరియించెదము

భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)
సర్వము చక్కగ చేసె (2)    ||భక్తులారా||

గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే (2)
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్ (2)  ||భక్తులారా||

ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే (2)
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే (2)     ||భక్తులారా||

కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై (2)
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు (2)    ||భక్తులారా||

బెత్లెహేములో సందడి

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)   ||బెత్లెహేములో||

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)  ||బెత్లెహేములో||

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)   ||బెత్లెహేములో||

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)   ||బెత్లెహేములో||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...