Showing posts with label సిలువ-పాటలు. Show all posts
Showing posts with label సిలువ-పాటలు. Show all posts

Wednesday, 11 March 2026

మనకై యేసు మరణించె – మన పాపముల కొరకే

 

Song Title

పల్లవి

మనకై యేసు మరణించె – మన పాపముల కొరకే
నిత్య జీవము నిచ్చుటకే – సత్యుండు సజీవుడాయే

చరణం 1

తృణికరింపబడె – విసర్జింపబడెను
మనుష్యులచే తక్కువ చేయబడెను

చరణం 2

మన దుఃఖములు భరించె
మన వ్యాధులు మోయెను

Song Video

YouTube video embed here

Monday, 9 March 2026

మనకై యేసు మరణించె - మన పాపముల కొరకే



మనకై యేసు మరణించె - మన పాపముల కొరకే

నిత్య జీవము నిచ్చుటకే - సత్యుండు సజీవుడాయే

1.తృణికరింపబడే - విసర్జింపబడెను

   దుఃఖక్రాంతుడాయె - వ్యసనములు భరించెను            ॥మనకై॥


2.మన వ్యసనములు వహించెను మన దుఃఖముల భరించెను
  మన మెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి     ॥మనకై॥


3.మన యతిక్రమముల కొరకు మన దోషముల కొరకు

  మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె            ॥మనకై|| 4.గొర్రెలవలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్

  అరుదెంచే కాపరియై - అర్పించె ప్రాణమును                ॥మనకై॥


5.దౌర్జన్యము నొందెను - బాధింపబడెను                      

  తన నోరు తెరువలేదు - మనకై క్రయధన మీయన్        ॥మనకై||


6. ఎదిరింపలే దెవరిన్ - లేదే కపటము నోట              

    యెహోవా నలుగ గొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్     ॥మనకై॥


7. సిలువలో వ్రేలాడెన్ సమాధిలో నుండెను

    సజీవుండై లేచెన్- స్తోత్రము హల్లెలూయ                 ॥మనకై॥

అపరాధిని యేసయ్య - కృపజూపి బ్రోవుమయ్యా



అపరాధిని యేసయ్య - కృపజూపి బ్రోవుమయ్యా

నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు


1. సిలువకు నిను నే గొట్టితిని - తులువలతో జేరితిని 

కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా  llఅపll


2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే 

మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో      llఅపll


3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి 

నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రి          llఅపll


4. దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి 

ద్రోహుండనై జేసితిని - దేహంబు గాయంబులను    llఅపll


5. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని 

క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా       llఅపll


6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత 

నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా        llఅపll


7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా 

అక్షయభాగ్యమునియ్య - మోక్షంబు జూపితివయ్యా    llఅపll

Thursday, 5 March 2026

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా     ||హే ప్రభు||

1.శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ            ||సిల్వధరా||

2.తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా            ||సిల్వధరా||

3.మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా         ||సిల్వధరా||

4.పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా            ||సిల్వధరా||

5.కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా          ||సిల్వ ధరా||

6.దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా      ||సిల్వ ధరా||

7.పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా             ||సిల్వ ధరా||

8.ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా     ||సిల్వ ధరా||

9.కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా  ||సిల్వ ధరా||

సిలువే నా శరణాయెను రా

సిలువే నా శరణాయెను రా

నీ… సిలువే నా శరణాయెను రా

సిలువ యందే ముక్తి బలము చూచితి రా

నీ… సిలువే నా శరణాయెను రా


సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా

పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా

శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువ చెంత చేరిననాడు

సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయున్

పౌలువలెను సీలవలెను - సిద్ధపడిన భక్తులజూచి


1.కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన - పిలచుచుండే పరము చేర  ||సిలువ||


2.వంద గొర్రెల మందలోనుండి - ఒకటి తప్పి ఒంటరియాయే - తొంబది తొమ్మిది గొర్రెల విడిచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్     ||సిలువ||

3.తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపోయే - తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రియతని జేర్చుకొనియే      ||సిలువ||

4.పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందుల జెర - పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము     ||సిలువ||

సిలువలో సాగింది యాత్ర

సిలువలో సాగింది యాత్ర

కరుణామయుని దయగల పాత్ర (2)

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే             ||సిలువలో||


1.పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)     ||ఇది ఎవరి||

2.వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)     ||ఇది ఎవరి||

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల

విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2)


1.ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2)      ||సిలువలో||

2.నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2)    ||సిలువలో||

3.మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)
సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2)           ||సిలువలో||

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)

వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా

నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా           ||సిలువలో||


1.నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)    ||వెలి||

2.వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2)          ||వెలి||

3.నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2)   ||వెలి||

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము – యేసు రక్తము


1.సమకూర్చు నన్ను తండ్రితో - యేసు రక్తము సంధి చేసి చేర్చును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
(2) ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము

2.సమాధాన పరచును – యేసు రక్తము సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము
(2) సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము

3.నీతిమంతులుగ చేయును – యేసు రక్తము దుర్నీతి నంత బాపును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము

4.రోగములను బాపును – యేసు రక్తము దురాత్మల పారద్రోలును – యేసు రక్తము
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును – యేసు రక్తము

Sunday, 22 February 2026

యేసు రక్తమే జయము జయమురా

యేసు రక్తమే జయము జయమురా

సిలువ రక్తమే జయము జయమురా

ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా

తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2)  ||యేసు||


1.బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే  ||యేసు||

2.పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే   ||యేసు||

యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము (2)

అమూల్యమైన రక్తము

నిష్కళంకమైన రక్తము  ||యేసు రక్తము||


1.ప్రతి ఘోర పాపమును కడుగును

మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2)  ||యేసు రక్తము||

2.మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2)  ||యేసు రక్తము||

3.మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||


మోసితివా నా కొరకై సిలువ వేదనను

1.మోసితివా నా కొరకై సిలువ వేదనను

గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో

సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును

పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము  ||మోసితివా||

2.అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్
ఏలీ ఏలీ లామా సబక్తానీ చే విడిచి
దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా
ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని
హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో
దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో  ||మోసితివా||

3.తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం తరగని వేదన నీకు సిలువ విజయమునకే
కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత
విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా
చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే
అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా  ||మోసితివా||


భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా   ||భాసిల్లెను||

1.కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)   ||భాసిల్లెను||

2.దోషము చేసినది నేనెకదా - మోసముతో బ్రతికిన నేనె కదా
మోసితివా నా శాపభారం (2)   ||భాసిల్లెను||

3.పాపము చేసి గడించితి మరణం - శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)  ||భాసిల్లెను||

4.నీ మరణపు వేదన వృధా గాదు - నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||

5.ఎందులకో నాపై ఈ ప్రేమ - అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
6.నమ్మిన వారిని కాదన వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2)  ||భాసిల్లెను||

Wednesday, 31 December 2025

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్

“నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్దీకరించున్ -నీ రక్తమే నా బలము”  (2)
1.నీ రక్త ధారలే ఇల - పాపికాశ్రయంబిచ్చును - పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచుము.  (2)  ||నీ రక్తమే||
2.నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగ నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది.  (2)  ||నీ రక్తమే||
3.నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
పరమ పావన కడుగుము - పవిత్రపరచుము పాపిని.  (2)  ||నీ రక్తమే||
4.నన్ను వెంబడించు సైతానున - నన్ను బెదరించు సైతానున్.  (2) దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే.  (2) ||నీ రక్తమే||
5.స్తుతి మహిమ ఘనతయు - యుగయుగంబులకును.  (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడా నీకే తగును.  (2) ||నీ రక్తమే||

Tuesday, 30 December 2025

కలువరిగిరిలో సిలువధారియై

కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా ”. (2)


1.అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా. (2)       ||కలువరిగిరిలో||
2.దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. (2) ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. (2)         ||కలువరిగిరిలో||

Sunday, 28 December 2025

ఎంతో వింత యెంతో చింత

ఎంతో వింత యెంతో చింత-యేసునాధు మరణ మంత-పంతము తో
జేసి రంత-సొంత ప్రజలు స్వామి నంత         ||ఎంతో||

1.పట్టి కట్టి నెట్టి కొట్టి - తిట్టి రేసు నాధు నకటా - అట్టి శ్రమల నొంది
పలుక - డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||

2.మొయ్యలేని మ్రాను నొకటి - మోపి రేసు వీపు పైని - మొయ్యలేక -
మ్రాని తోడ - మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||

3.కొయ్యపై నేసయ్యన్ బెట్టి - కాలు సేతులలో జీలల్ - కఠిను లంత
గూడి కొట్టిరి - ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||

4.దాహము గొన చేదు చిరక - ద్రావ నిడిరి ద్రోహు లకటా = ధాత్రి
ప్రజల బాధ కోర్చి - ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||

5.బల్లెముతో బ్రక్కన్ బొడవన్ - పారే నీరు రక్త మహహా - ఏరై పారే
యేసు రక్త - మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...