Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Wednesday, 4 March 2026

వేవేల దూతలతో కొనియాడబడుచున్న

వేవేల దూతలతో కొనియాడబడుచున్న

నిత్యుడగు తండ్రి సమాధాన కర్త

బలవంతుడైన దేవా       ||వేవేల||


మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం
నే మరువలేను నా దేవా (2)
ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2)
ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2)     ||వేవేల||

మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు
మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2)
ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2)
మా కొరకు సిలువలో బలి అయినావు (2)     ||వేవేల||

వేసారిన మనసే ఊగెనే

వేసారిన మనసే ఊగెనే

చేజారిన స్ధితికి చేరెనే

యే గాయమైన మానదే

నాకున్న బలము చాలదే (2)

వినిపించు యేసు నీ స్వరం

నడిపించు నీతో అనుక్షణం      ||వేసారిన||


కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
తాళలేను లేసమైన నీ కోపమే
భారము మోపకే లోపమూ చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే  ||వేసారిన||

వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే – త్రోవను చూపునే
చేకటి కమ్మినా క్షేమము పంపునే    ||వేసారిన||

వేయి నోళ్లతో స్తుతియించినా

వేయి నోళ్లతో స్తుతియించినా

నీ ఋణమును నే తీర్చగలనా

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా


నా రోగములను భరియించి
నా వ్యసనములను వహియించి
నా దోషములను క్షమియించి
స్వస్థత నొసగిన నా దేవా       ||యేసయ్యా||

శోధనలో నాకు జయమిచ్చి
బాధలలో నను ఓదార్చి
బలహీనతలో బలమిచ్చి
నెమ్మది నొసగిన నా దేవా     ||యేసయ్యా||

వేటగాని ఉరిలో నుండి

వేటగాని ఉరిలో నుండి

నా ప్రాణాన్ని రక్షించావు

బలమైన రెక్కల క్రింద

నాకాశ్రయమిచ్చావు (2)


లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)

రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

వెండి బంగారాల కన్న మిన్న అయినది

వెండి బంగారాల కన్న మిన్న అయినది

యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)

లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)

లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)    ||వెండి||


లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)       ||వెండి||

ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)       ||వెండి||

వీనులకు విందులు చేసే

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర

వేగిరమే వినుటకు రారండి

ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి     ||వీనులకు||


రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
రండి…               ||వీనులకు||

రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
రండి…               ||వీనులకు||
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా (2)
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
రండి…               ||వీనులకు||

వింతైన తారక వెలిసింది గగనాన

వింతైన తారక వెలిసింది గగనాన

యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)

జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ

దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)


మనమంతా జగమంతా

తారవలె క్రీస్తును చాటుదాం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్

వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్


ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి   ||మనమంతా||

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి      ||మనమంతా||

వివాహమన్నది పవిత్రమైనది

వివాహమన్నది పవిత్రమైనది

ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)


ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)        ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)  ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)    ||వివాహమన్నది||

వినుమా యేసుని జననము

వినుమా యేసుని జననము

కనుమా కన్య గర్భమందున (2)

పరమ దేవుని లేఖనము (2)

నెరవేరే గైకొనుమా (2)

ఆనందం విరసిల్లె జనమంతా

సంతోషం కలిగెను మనకంతా

సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత

చిరజీవం దిగివచ్చె భువికంతా      ||వినుమా||


గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట
చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి
మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన
ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా    ||వినుమా||

పాపులనంతా రక్షింపగా
పరమును విడిచె యేసు (2)
దీనులకంతా శుభవార్తేగా (2)
నడువంగ ప్రభువైపునకు (2)     ||ఆనందం||

అదిగో సర్వలోక రక్షకుడు
దివినుండి దిగివచ్చినాఁడురా (2)
చూడుము యేసుని దివ్యమోమును (2)
రుచియించు ప్రభుని ప్రేమను (2)  ||ఆనందం||

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే

విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే

అది ఎంతో విలువని నాకు చూపితివే

జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు

నీ జీవితాన్నే ధారబోసితివే (2)


నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2)      ||నీది||

పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2)      ||నీది||

సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)     ||విలువేలేని||

వినవా మనవి యేసయ్యా

వినవా మనవి యేసయ్యా

ప్రభువా శరణం నీవయ్యా

మలినము నా గతం – పగిలెను జీవితం

చేసుకో నీ వశం        ||వినవా||


లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా   ||వినవా||

ఆశ ఏది కానరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా
నా దైవము నీవయ్యా   ||వినవా||

వినరే యో నరులారా – వీనుల కింపు మీర

వినరే యో నరులారా – వీనుల కింపు మీర

మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే

అనుదినమును దే-వుని తనయుని పద

వనజంబులు మన-మున నిడికొనుచును    ||వినరే||


నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే        ||వినరే||

ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము – సలిపిన తెరంగిది       ||వినరే||

ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును  ||వినరే||

దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె – శరణని పోదము       ||వినరే||

వినరండి నా ప్రియుని విశేషము…

వినరండి నా ప్రియుని విశేషము…

వినరండి నా ప్రియుని విశేషము


నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని (2)
ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే     ||వినరండి||

మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
జతగా చేరెదను ఆ సన్నిధిలో
కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే       ||వినరండి||

జగతికి రూపము లేనప్పుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును     ||వినరండి||

తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు     ||వినరండి||

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త

మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను

వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను

తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)

ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం

యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2)      ||విన్నారా||


దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా    ||ఊరు వాడా||

ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా       ||ఊరు వాడా||

విడువను నిను ఎడబాయనని నా

విడువను నిను ఎడబాయనని నా

కభయ మొసంగిన దేవా

నా కభయ మొసంగిన దేవా


నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా     ||విడువను||

పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా              ||విడువను||

మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి             ||విడువను||

సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2)
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను    ||విడువను||

విడువదు మరువదు – విడువదు మరువదు

విడువదు మరువదు – విడువదు మరువదు

విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు

ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ

మితిలేని ప్రేమ.. నీ ప్రేమ        ||విడువదు||


నా స్థితి ఏదైనా – చింత ఏదైనా
బాధ ఏదైనా – నను విడువదు
లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా
యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు
మా నాన్న నా చేయి విడువడు
ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)

విడువడు మరువడు – విడువడు మరువడు
విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు

నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న
నా తండ్రి కౌగిలి – నే విడువను
శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా
నా ప్రియుని చిరునవ్వు – నే మరువను
నన్నెంతో ప్రేమించిన రాజును
ఎడబాసి మనలేనే రోజును (2)

విడువను మరువను – విడువను మరువను
విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను
ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ       ||విడువను||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...