Showing posts with label మిషనరీ పాటలు. Show all posts
Showing posts with label మిషనరీ పాటలు. Show all posts

Wednesday, 18 March 2026

నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు

 నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు

    నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరె వున్నారు
    ఎవరైనా మీలో ఎవరైనా - వెళతారా నా ప్రేమను చెబుతారా      ॥నా పేరే॥

1. నేను నమ్మిన వారిలో  -  కొందరు మోసం చేశారు
    వెళతానని చెప్పి  -  వెనకకు తిరిగారు

    ఎవరైనా మీలో ఒకరైనా  - వెళతారా నా ప్రేమను చెబుతారా      ॥నా పేరే॥

2. రక్షణ పొందని ప్రజలు  -  లక్షల కొలదిగ ఉన్నారు
    మారుమూలల గ్రామాల్లో -  ఊరివెలుపలి వీధుల్లో
    ఎవరైనా మీలో ఎవరైనా - వెళతారా నా ప్రేమను చెబుతారా       ॥నా పేరే॥

3. వెళ్ళగలిగితే మీరు  -  తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే   -  వెళ్ళే వారిని పంపండి
  ఎవరైనా మీలో ఎవరైనా   -   వెళతారా నా ప్రేమను చెబుతారా   ॥నా పేరే॥

ఉజ్జీవము రావాలి - నిజజీవము కావాలి - నిర్జీవము పోవాలి

   ఉజ్జీవము రావాలి  -  నిజజీవము కావాలి  -  నిర్జీవము పోవాలి


1. నిజ భక్తులు లేవాలి నజరేయుని సేవింప  -   విజయుండగు ప్రభుకొరకై
    ధ్వజమెత్తుకు నడవాలి నిజభక్తులు లేవాలి  -   నజరేయుని సేవింప  ॥ఉజ్జీవ॥

2. త్యాగముతో రావాలి లోకాశలు చావాలి  -  ఆనురాగం కావాలి
  అందరికై ప్రార్ధింప త్యాగముతో రావాలి   -   లోకాశలు చావాలి     ॥ఉజ్జీవ॥

3. భారముతో సాగాలి  - సువార్తను చాటాలి  - మరణించెడి పాపులకై
  కరుణించగ రావాలి  -   భారముతో సాగాలి  -  సువార్తను చాటాలి   ॥ఉజ్జీవ॥


4. వేదనతో లేవాలి  -  బాధితులను విడిపింప  -   బ్రతుకంతా ప్రభుకొరకై
    తుదివరకు నిలవాలి  -  వేదనతో లేవాలి   -  బాధితులను విడిపింప   ॥ఉజ్జీవ॥

5. మోకాళ్ళను వంచాలి- మనసంతయు నిలపాలి- ప్రభుయేసుని రక్తములో
    పరిశుద్ధులు కావాలి - మోకాళ్ళను వంచాలి  - మనసంతయు నిలపాలి ॥ఉజ్జీవ॥

6. ప్రాణాత్మలు వంచాలి  -  ప్రార్ధనకై రావాలి  -  ప్రాపంచిక కోరికలు
    ప్రభుకొరకై విడవాలి  -  ప్రాణాత్మలు వంచాలి  -  ప్రార్ధనకై రావాలి    ॥ఉజ్జీవ॥

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా

  ప్రార్ధన వినెడి పావనుడా  -  ప్రార్ధన మాకు నేర్పుమయా


1. శ్రేష్టమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
    పరముడ నిన్ను - ప్రణుతించెద ప్రియముగ - పరలోక ప్రార్ధన నేర్పుమయా   ॥ప్రార్ధన॥


2. పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగమోడ్చి = శిరమును
    వంచి సరిగను వేడిన   - సుంకరి ప్రార్ధన నేర్పుమయా    ॥ప్రార్ధన॥


3. దినదినంబు చేసిన సేవ  -  దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
    ఒంటిగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా             ॥ప్రార్ధన॥

4. శత్రుమూక నిను చుట్టుకొని  -  సిలువపైని నిను జంపగను 

    శాంతముతో శరణని వేడిన గెత్సెమనె ప్రార్ధన నేర్పుమయా    ॥ప్రార్ధన॥

ప్రార్థించు యోధులు లేవాలి - ప్రార్థించి ఆత్మల గెలవాలి

  ప్రార్థించు యోధులు లేవాలి  - ప్రార్థించి ఆత్మల గెలవాలి
      సడలిన మోకాళ్ళు బలపరచి  -  ప్రార్ధించు వరమును పొందాలి.


1. అహమును ప్రభుకు లోబరచి  -  దీనమనస్సును ధరియించి
    యేసుని చెంత కూర్చుంటే దేశం క్షేమం పొందునులే      ॥ప్రార్థించు॥    


2. వేకువ ప్రార్ధన శక్తినొంది  -   విజ్ఞాపనలు అధికం చేసి
    దేశము నాశనమగుచుండ  -  ఆసక్తితో ప్రార్దించెదము   ॥ప్రార్థించు॥ 


3. బండ సందులలో నిలుచువాడు  -   ధైర్యముగా ప్రకటించునట్లు
    ఉజ్జీవజ్వాలలు ఆరకుండ - ప్రార్థించి దేశాన్ని అలంకరిద్దాం    ॥ప్రార్థించు॥ 

ప్రార్థన చేసెదము కన్నీరు కార్చెదము దేశపు క్షేమముకై

  ప్రార్థన చేసెదము కన్నీరు కార్చెదము దేశపు క్షేమముకై
          ప్రార్థించి జయమొందెదం వేకువ జామున, రాత్రికాలమున
          పగలు, రాత్రి  ఎడతెగక  -  ఎల్లప్పుడెల్లపుడు

1. ప్రార్థించిన   - సాతాను పారిపోవున్  -  ప్రార్ధించిన ఎదురింపులణగిపోవున్
    ప్రార్థన ప్రార్థనయే ... ప్రార్ధన ప్రార్ధనయే…….. (2)

   వేడెదం  ఇచ్చెదం  త్వరపడి  కృషిచేసెదం   (2)    (మనం)    ॥ప్రార్థన॥  2. గంగలో - మునిగెడువారదిగో  -  పుణ్యక్షేత్రాలకు వెళ్లెడి వారదిగో

    దుఃఖించు వారెవరు - వీరికై విలపించు వారెవరు
    ఎవరు ఎవరు మనలో వారెవరు      (2)     (ఎవరు)        ॥ప్రార్థన॥

3. దైవాత్మతో అనుదినం ఎదిగెదము   -  దైవకృపలో ముందుకు సాగెదము
    ప్రార్ధన ప్రార్ధనతో ప్రార్ధన ... ప్రార్ధనతో

    దేశమును మన స్వాస్థ్యముగా పొందెదం    (2)   (మన)    ॥ప్రార్థన॥

Sunday, 22 February 2026

యెహోవా నీ నామము ఎంతో బలమైనది

యెహోవా నీ నామము - ఎంతో బలమైనది

ఎంతో బలమైనది - ఎంతో బలమైనది   || యెహోవా ||

1.మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి (2)

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి || యెహోవా || 2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా (2)  అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి (2)      || యెహోవా ||

3.సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము (2)            || యెహోవా || 4.చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను (2)    || యెహోవా || 5.పౌలు సీలను బంధించి - చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయే (2)         ||యెహోవ|| 6. మానవుల రక్షణ కోరకై - నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా - ప్రకటించే నీ వాక్యము ||యెహోవ||

ప్రభు యేసు నా రక్షకా

  ప్రభు యేసు నా రక్షకా  -  నొసగు కన్నులు నాకు  నిరతము
  నే నిన్ను జూడ (2)  అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)   ||ప్రభు యేసు||

1. ప్రియుడైన యోహాను పత్మాసులో  -  ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

2. లెక్కలేని మార్లు పడిపోతిని  -  దిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచి  -  గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)    ||ప్రభు యేసు||

3. ఎరిగి యెరిగి నే చెడిపోతిని  -  యేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితి  -  దాసుడ నన్ను జూడనిమ్ము (2)  ||ప్రభు యేసు||

4. ఎందరేసుని వైపు చూచెదరో  -  పొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచు  -  ముందుకు పరుగెత్తెదరు (2)   ||ప్రభు యేసు||

5. విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ  -  కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచు  -  విసుగక పరుగెత్త నేర్పు (2)  ||ప్రభు యేసు||

6. కంటికి కనబడని వెన్నియో  -  చెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియో  -  సిద్ధపరచితివ నాకై (2)      ||ప్రభు యేసు||

7. లోక భోగాలపై నా నేత్రాలు  -  సోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమును  -  నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

Tuesday, 23 December 2025

ఇది కోతకు సమయం

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2)  ||ఇది కోతకు||

1.కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2)    ||ఇది కోతకు||

2.సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2)         ||ఇది కోతకు||

3.శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపవా (2)     ||ఇది కోతకు||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...