Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Thursday, 5 March 2026

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు - మెడ్లీ

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2)
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2)

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ
శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు
ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా (2)
జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2)

సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రమానుభవమును (2)
సహించి వహించి ప్రేమించగల నీ..

సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో

సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసముగను మాకు దెలుప నీ..

సమానులెవరు ప్రభో
నీ సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో

భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా (2)
మహిమాన్విత చిర జీవనిధి

శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి

భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె – కాచిన కృప

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2)
నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (3)

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ… (2)

నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2)

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2)

నా యేసయ్యా.. నా రక్షకుడా
నా యేసయ్యా.. నా యేసయ్యా..
నా యేసయ్యా.. నా యేసయ్యా..

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)     ||సోలిపోవలదు||

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2)             ||సోలిపోవలదు||

శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2)          ||సోలిపోవలదు||

వాక్కు ఇచ్చిన దేవుని నీవు
పాడి కొనియాడు (2)
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను
చేరే ప్రార్ధించు (2)                ||సోలిపోవలదు||

సొంతమైపోవాలి నా యేసుతో

సొంతమైపోవాలి నా యేసుతో
మిళితమై పోవాలి నా ప్రియునితో (2)
సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో
లీనమై పోవాలి ఆ ప్రేమలో (2)

నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి
నా వరుడు కలువరిలో బలియాయెను (2)
బలి అయిన వానికే నా జీవితం
అర్పించుకొనుటే నా ధర్మము (2)
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2)      ||సొంతమై||

పరదేశిగా నేను వచ్చానిలా
తన ప్రేమ కీర్తిని చాటాలని (2)
ప్రియుని కోసమే బ్రతికెదను
కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను
కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం (2)       ||సొంతమై||

సేవకులారా సువార్తికులారా

సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము       ||సేవకులారా||

మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే
మనము గొప్పవారము కాదు
మనము మంచివారము కాదు
మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు

దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు       ||ఉన్నత||

ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి
మీ శరీరము దేవుని ఆలయమిది
మీరు విలువ పెట్టి కొనబడిన వారు

సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము       ||సేవకులారా||

హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్,
దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్
షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్

సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము    ||ఉన్నత||

సూడ సక్కని బాలుడమ్మో

సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు (2)     ||సూడ||

బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2)         ||సూడ||

మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2)    ||సూడ||

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?

అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?

కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?

ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?

ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం

తరచి చూడుము పరికించి చూడము (2)       ||సుందరమైన||


నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు (2)
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)
యేసులేని జీవితం వాడబారిన చరితం (2)
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2)      ||సుందరమైన||

ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)
యేసులేని జీవితం అంధకార భందురం (2)
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2)  ||సుందరమైన||

సువార్తను ప్రకటింపవా

సువార్తను ప్రకటింపవా

సునాదము వినిపింపవా

సిలువను ధరియించవా

దాని విలువను వివరింపవా

లెమ్ము సోదరా

లేచి రమ్ము సోదరీ (2)       ||సువార్తను||


సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు (2)
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా (2)      ||లెమ్ము||

నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు (2)
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా (2)       ||లెమ్ము||

సుమధుర స్వరముల గానాలతో

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)

మహదానందమే నాలో పరవశమే

నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2)         ||సుమధుర||


ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము (2)          ||సుమధుర||

సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము (2)        ||సుమధుర||

వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన (2)              ||సుమధుర||

సుధా మధుర కిరణాల అరుణోదయం

సుధా మధుర కిరణాల అరుణోదయం

కరుణామయుని శరణం అరుణోదయం (2)

తెర మరుగు హృదయాలు వెలుగైనవి

మరణాల చెరసాల మరుగైనది (2)          ||సుధా||


దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)    ||సుధా||

లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)     ||సుధా||

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో

ఆస్వాదింతును నీ మాటల మకరందము   ||సుగుణాల||


యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే             ||సుగుణాల||

యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో          ||సుగుణాల||

యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే                ||సుగుణాల||

సీయోను పాటలు సంతోషముగా

సీయోను పాటలు సంతోషముగా

పాడుచు సీయోను వెల్లుదము (2)


లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2)        ||సీయోను||

ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానానుపై నిల్పుడి (2)    ||సీయోను||

మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము (2)   ||సీయోను||

ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని
విధేయులై విరాజిల్లుడి (2)           ||సీయోను||

ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకు జై (2)    ||సీయోను||

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై

సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)


నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)

నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)
నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను యెడబాయవు
నీవు విడువవు నను యెడబాయవు      ||సీయోనులో||

నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)
కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)
నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని
కీర్తిoచెదను ప్రతినిత్యం
నిను ఆరాధింతును అనుక్షణము          ||సీయోనులో||

నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)
నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)
నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను       ||సీయోనులో||

సిలువే నా శరణాయెను రా

సిలువే నా శరణాయెను రా

నీ… సిలువే నా శరణాయెను రా

సిలువ యందే ముక్తి బలము చూచితి రా

నీ… సిలువే నా శరణాయెను రా


సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా

పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా

శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువ చెంత చేరిననాడు

సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయున్

పౌలువలెను సీలవలెను - సిద్ధపడిన భక్తులజూచి


1.కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన - పిలచుచుండే పరము చేర  ||సిలువ||


2.వంద గొర్రెల మందలోనుండి - ఒకటి తప్పి ఒంటరియాయే - తొంబది తొమ్మిది గొర్రెల విడిచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్     ||సిలువ||

3.తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపోయే - తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రియతని జేర్చుకొనియే      ||సిలువ||

4.పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందుల జెర - పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము     ||సిలువ||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...