1. ఇన్నాళ్లు మాకు సాయమై - యీ ముందుకును మా
యున్నత గృహ మండవై - యొప్పెడు దైవమా !
2. ఏలాటి యీతి బాధయు - నీవచ్చు యేటిలో
కలుగకుండ బ్రోవవే - ఘనంపు ప్రేమతో
3. నీ సింహాసన నీడలో - నిలుచు భక్తులు
భయంబు చింతబాధలన్ - జయించి మనురు
4. చరాచరంబు లెల్లను - జనించుకంటె మున్
దరతరాల నుండియున్ - నీ రాజ్య ముండెడున్
5. ఇన్నాళ్లు మాకు సాయమై - యేలుచు గాచిన
ఉన్నత ప్రభు ప్రేమతో - మన్నించు మింకనున్