నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరె వున్నారు
ఎవరైనా మీలో ఎవరైనా - వెళతారా నా ప్రేమను చెబుతారా ॥నా పేరే॥
1. నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేశారు
వెళతానని చెప్పి - వెనకకు తిరిగారు
ఎవరైనా మీలో ఒకరైనా - వెళతారా నా ప్రేమను చెబుతారా ॥నా పేరే॥
2. రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలదిగ ఉన్నారు
మారుమూలల గ్రామాల్లో - ఊరివెలుపలి వీధుల్లో
ఎవరైనా మీలో ఎవరైనా - వెళతారా నా ప్రేమను చెబుతారా ॥నా పేరే॥
3. వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే - వెళ్ళే వారిని పంపండి
ఎవరైనా మీలో ఎవరైనా - వెళతారా నా ప్రేమను చెబుతారా ॥నా పేరే॥