Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Wednesday, 4 March 2026

రోజంతా ద్వేషం మనుషుల కోపం

రోజంతా ద్వేషం మనుషుల కోపం

తీరని బాధ ఇది తీరము చేరనిది

అవమానం ఆవేశం

కన్నీళ్ళే ఈ దేహం

విరిగిన హృదయం నలిగిన దేహం

శవమై పోవులే ఈ జీవితము

ఊపిరి ఆహుతై మిగిలెనే


నీ కృప నాకు చాలును దేవా
నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా   (2)

గర్బము లేని ఈ శరీరము
నిందై పోయిన ఈ జీవితము
నీ ప్రజలే నన్ను ద్వేషించగా
అయిన వాల్లే శోధించిగా
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో   (2)

నీ కృప నాకు చాలును దేవా
నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా   (2)
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో   (2)

నిలబెట్టుము దేవా నీ ప్రజలతో
నిందైన నన్ను నీ సాక్షముతో
చేయి పట్టి నడుపుము నీ మార్గములో
పడుతున్న నన్ను నీ వాక్యముతో

ఎవరు మాట్లాడినా నీ స్వరమే అది
ఎవరు ప్రేమించినా నీ ప్రేమా అది
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో   (2)

నీ కృప నాకు చాలును దేవా
నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా   (2)
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో   (2)

రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా

రెండే రెండే దారులు

ఏ దారి కావాలో మానవా

ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)

పరలోకం కావాలో పాతాళం కావాలో

తెలుసుకో మానవా (2)


పరలోకం గొప్ప వెలుగుతో
ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
సూర్యుడుండడు చంద్రుడుండడు
చీకటుండదు రాత్రియుండదు
నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)    ||రెండే||

పాతాళం అగ్ని గుండము
ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
గప్పగప్పున రగులుచుండును
ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)     ||రెండే||

పుడతావు నీవు దిగంబరిగా
వెళతావు నీవు దిగంబరిగా (2)
గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)    ||రెండే||

రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు

రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)

రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)       || రుచి చూచి||


గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)  || రుచి చూచి||

మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||

మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||

కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)    || రుచి చూచి||

ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)  || రుచి చూచి||

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము

నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు


హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         ||రావయ్య||

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు   ||రావయ్య||

మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు     ||రావయ్య||

పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు పారద్రోలుటకు     ||రావయ్య||

అందమైన నీదు పరమానంద పురమందు
మేమందరము జేరి యానందించుటకు     ||రావయ్య||


రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్

రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్

సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)

పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట

లోకాన పండగంట (2)    ||రారే||


మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2)  ||రారే||


రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
పాప భారము మోసి మరణ కోరలు విరచి
శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2)      ||రారే||

రారే మన యేసు స్వామిని

రారే మన యేసు స్వామిని

జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని

గూరిమి భక్తుల జేరువ విందట

భూరిద యామృత సారము లొలికెడు

చారు కటాక్ష వి – శాలేక్షనుడట

నారకులగు నర – నారీ జనులకు

దారక మొసగను దానే పిలుచునట

దారుణ పాప మ-హారణ్యమునకు

గారు చిచ్చు గతి గన్పడువాడట

ఘోర దరిద్రత గూల్చెడి వాడట

సారంబగు తన సభకు మకుటమాట     ||రారే||


పతిత పావనమౌ వేల్పట
అనాది దేవ సుతుడై – ఇల జేరినాడట
సతతము కడు దురి – తతమోయుతమగు
ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట
అతులిత మోక్షో – న్నత గుణగణుడట
కుతలంబున స-ద్గతి రహితంబగు
పతితుల గావను – మృతుడైనాడట
అతి పుణ్య తను – క్షత శోణితమును
వ్రతముగ సిలువను నతఁడొసంగెనట
మృతిని జయించుచు బ్రతికి లేచెనట
మతి నమ్మిన మన గతి యితడేనట        ||రారే||

తుదలేని మహిమ వాడట
తను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూటట
చెదరిన గొర్రెల – వెదక వచ్చెనట
చిదురుపలగు జన హృదయములన్నిట
బదిలముగా నె-మ్మది నిడువాడట
నదితట మఠ జన వదనముల స
మ్మద శుభవార్తను – బలికినవాడట
సదయత సంధుల – కక్షుల నిడెనట
వెదకి బధిరులకు – వీనులొసగె నట
సదమల మోక్ష ప్రభుడగు విభుడట
యిదిగో మనకిత డేలినవాడట     ||రారే||

రారే చూతము రాజసుతుని

రారే చూతము రాజసుతుని

రేయి జనన మాయెను (2)

రాజులకు రారాజు మెస్సయ్యా (2)

రాజితంబగు తేజమదిగో (2)   ||రారే||


దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2)   ||రారే|| 

కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2)  ||రారే||

బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2)     ||రారే||

యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||

రారాజు వస్తున్నాడో

రారాజు వస్తున్నాడో

జనులారా.. రాజ్యం తెస్తున్నాడో

త్వరపడి వేగమే రండి

ప్రియులారా.. ప్రభుని చేరగ రండి

వస్తానన్న యేసు రాజు రాక మానునా

తెస్తానన్న బహుమానం తేక మానునా (2)    ||రారాజు||


పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన (2)
మహిమకు యేసే మార్గము జీవము (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)    ||వస్తానన్న||

పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)    ||వస్తానన్న||

కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును (2)    ||వస్తానన్న||

రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్

రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్

సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)

ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్

మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్

నింగి నేల పొంగిపోయే…

ఆ తార వెలసి మురిసిపోయే

సంబరమాయెనే, హోయ్…      ||రారాజు||


వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగ మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలోన ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై…..    ||రారాజు||

మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడెనంట
మరువని బంధమై…..    ||రారాజు||

రారాజు జన్మించే ఇలలోన

రారాజు జన్మించే ఇలలోన

యేసు రారాజు జన్మించే ఇలలోన (2)

ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా

రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)

ఓ సోదరా… ఓ సోదరీ… (2)

విష్ యు హాప్పీ క్రిస్మస్

అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)   ||రారాజు||


అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)   ||ఓ సోదరా||

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)   ||ఓ సోదరా||

రాజు పుట్టెను రాజు పుట్టెను

రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను

దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను        ||రాజు పుట్టెను||

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను       ||రాజు పుట్టెను||

రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..

రాజుల రాజు.. రాజుల రాజు.. రాజుల రాజు..

రాజుల రాజు జన్మించెను

ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను

రాజుల రాజు…

రాజుల రాజు జన్మించెను

ఈ లోకానికే వెలుగు తాను తెచ్చెను

పశువుల పాకలోన – బెత్లెహేము నగరులోన (2)

జన్మించెను మన రారాజుడు

ఉదయించెను మన రక్షకుడు (2)


పరలోక మహిమను విడచి
దేవాది దేవుడు – తోడుండి నన్ను నడుప
నాతో నిలిచెను
పరలోక మహిమను విడచి
ఆశ్చర్యకరుడు – యేసయ్య నాకోసం
తరలి వచ్చెను          ||జన్మించెను||

యూదయ దేశమునందు
పరిశుద్ధుడు – యేసయ్య జన్మించె
నా కోసమే
బంగారం సాంబ్రాణి బోళం
యేసయ్యకు – అర్పించి ఆరాధించి
ఆనందించిరి       ||జన్మించెను||

రాజులకు రాజు పుట్టెనన్నయ్య

రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)

రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||


యుదాయనే దేశమందన్నయ్య (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు||

తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2)  ||రాజులకు||

బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు||

ఆడుదాము పాడుదామన్నయ్య (2)
వేడుకతో మనమేగుదామన్నయ్య (2)  ||రాజులకు||

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2)

నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2)

నీవే లేకుండా నేనుండలేనయ్యా

నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2)   ||రాజా||


నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2)  ||నేనుండలేనయ్యా||

ఒంటరి పోరు నన్ను విసిగించినా
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2)
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) ||నేనుండలేనయ్యా||

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2) ||నేనుండలేనయ్యా||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...