Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Tuesday, 30 December 2025

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

 “ గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్ ”
“హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా ”  (2)  ||గొప్ప||

అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని.  (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను.  (2)     ||హల్లెలూయా||

సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని.  (2)
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్.  (2)    ||హల్లెలూయా||


గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు

 “ గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు

గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ”  (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే.   (4)

లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే.  (2)   ||గుండె నిండా నువ్వే||

ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి.  (2)  ||గుండె నిండా నువ్వే||

చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం.  (2)   ||గుండె నిండా నువ్వే||


గీతం గీతం జయ జయ గీతం

 “ గీతం గీతం జయ జయ గీతం

చేయి తట్టి పాడెదము”.  (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము”. (2)   || గీతం||

చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు.    || గీతం||

వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి.    || గీతం||

అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి.    || గీతం||

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి.     || గీతం||


గాఢాంధకారములో నే నడచిన వేళలో

 " గాఢాంధకారములో నే నడచిన వేళలో ".  (2)
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును.  (2)

ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్ .(2)
జడియను బెదరను – నా యేసు నాకుండగా.  (2)

అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా. (2)
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును.(2)

అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును .(2)
జడియను బెదరను – నా యేసు నాకుండగా.(2)

గాడాంధకారపు లోయలో

 “ గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో ”  (2)

యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి.  (2)
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే.   ||గాడాంధకారపు||

పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు.  (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి.  (2)
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే.    ||గాఢాంధకారపు||

నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు.  (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి.  (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే.   ||గాఢాంధకారపు||

చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు.  (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి.  (2)
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే.  ||గాఢాంధకారపు||

గమ్యం చేరాలని నీతో ఉండాలని

 “ గమ్యం చేరాలని నీతో ఉండాలని

పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని ”  (2)  ||గమ్యం చేరాలని||

భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో.  ||సాగిపోతున్నాను||

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని. ||సాగిపోతున్నాను||


గతకాలమంత నీ నీడలోన

 “ గతకాలమంత నీ నీడలోన

దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన ”  –  (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా  (2)   ||గతకాలమంత||

ఎన్నెన్నో అవమానాలెదురైననూ
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగిననూ
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము.  (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా.  (2)  ||గతకాలమంత||

మాటలే ముళ్ళుగ మారిన వేళ
నీ మాట నన్ను పలకరించెనయా
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నను తాకెనయా
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట.  (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా.  (2)

గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన. – (2)
వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా. (2)  ||గతకాలమంత||


గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా

 “ గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా

నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా ”.  (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును.  (2)  ||గడిచిన||

ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు.  (2)
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి.  (2)   ||మరో యేడు||

నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా.  (2)
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి.  (2)    ||మరో యేడు||


గడచిన కాలము కృపలో మమ్ము

 “ హల్లెలూయా స్తోత్రం యేసయ్యా ”  (2)

“ గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము ”  (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము.  (2)   ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన.  (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము.  (2)   ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన.  (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము.  (2)  ||గడచిన||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...