Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Wednesday, 4 March 2026

లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా

లోకములో వెఱ్ఱివారిని యోగ్యులుగా చేసావయ్యా యేసయ్యా

విద్య లేని పామరులను పేరు పెట్టి పిలిచావయ్యా


జాలర్లను పిలిచావయ్యా యేసయ్యా
మనుష్యులు పట్టేవారుగా మార్చావయ్యా (2)
నన్ను అట్టి రీతిగా మార్చుమయా

జక్కయ్యను పిలిచావయ్యా యేసయ్యా
నేడు నీతో ఉంటానన్నావయ్యా (2)
నాతో అట్టి రీతిగా ఉండుమయా

సౌలును పిలిచావయ్యా యేసయ్యా
పౌలుగ మార్చావయ్యా (2)
నన్ను అట్టి రీతిగా మార్చుమయా

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు   ||లే నిలబడు||

రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం  ||లే నిలబడు||

సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం    ||లే నిలబడు||

లేచినాడురా సమాధి గెలచినాడురా

లేచినాడురా

సమాధి గెలచినాడురా (2) యేసు

లేతునని తా చెప్పినట్లు (2)

లేఖనములలో పలికినట్లు    ||లేచినాడురా||


భద్రముగా సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2)
నిద్ర లేక కావలియుండ       ||లేచినాడురా||

పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2)
పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా||

యేసునందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2)
యేసునందే మోక్ష భాగ్యం    ||లేచినాడురా||

పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2)
ప్రాణ దానము చేసినాడు     ||లేచినాడురా||

లోకమంతట వెలుగు ప్రకాశించెను

లోకమంతట వెలుగు ప్రకాశించెను

యేసు జన్మించినపుడు

ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు

లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)

లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి        ॥లోకమంతట॥


నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక – (2)
జీవపువెలుగై యుండుడనె యేసు   ॥లోకమంతట॥

ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)
పిల్లయే దీపమై వెలుగుచుండు      ॥లోకమంతట॥

విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి – (2)
వెలుగై యుందురనె యేసుండు       ॥లోకమంతట॥

చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు – (2)
ప్రభువు యేసుకు జేయని పాడరే     ॥లోకమంతట॥

లోకమును విడచి వెళ్ళవలెనుగా

లోకమును విడచి వెళ్ళవలెనుగా (2)

సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్   ||లోకమును||


యాత్రికులము ఈ దుష్ట లోకములో
పాడు లోకములో మనకేది లేదు (2)
ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము (2)    ||లోకమును||

మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము (2)
నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై
పరిపూర్ణతను చేపట్టుదాము (2)     ||లోకమును||

ఆత్మీయ నేత్రాలతో చూచెదాము
ఎంతా అద్భుతమో సౌందర్య నగరం (2)
ప్రభువు చెంతకు వెళ్ళెదము (2) వెళ్ళెదము
విజయోత్సవముతో ప్రవేశించెదము (2)   ||లోకమును||

లోకాన ఎదురు చూపులు

లోకాన ఎదురు చూపులు

శోకాన ఎద గాయములు

యేసులోన ఎదురు చూపులు

ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)

ఎదురు చూడాలి యేసుకై

నిరీక్షణా ప్రేమతో (2)      ||లోకాన||


నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)      ||లోకాన||

ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)      ||లోకాన||

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది

లెమ్ము తేజరిల్లుము నీకు

వెలుగు వచ్చియున్నది (2)

యెహోవా మహిమ నీపై

ప్రకాశముగా నుదయించె (2)    ||లెమ్ము||


యేసే యీ లోకమునకు

వెలుగై యున్నానని చెప్పెన్ (2)
యేసుని నమ్మువారు (2)
వెలుగులో నడుచువారు (2)    ||లెమ్ము||

అంధకార మందుండి
బంధింప బడిన వారిన్ (2)
ఆశ్చర్యమైన వెలుగు (2)
నందించి విమోచించెన్ (2)      ||లెమ్ము||

దాత ప్రభు యేసుని నమ్మి
నీతిగా నడుచువారు (2)
జాతి భేదములు లేక (2)
జ్యోతుల వలె నుందురు (2)    ||లెమ్ము||

మనుజులు మీ సత్క్రియలను
జూచి బహు సంతోషించి (2)
మనసారా పరమ తండ్రిన్ (2)
మహిమ పరచెదరు (2)      ||లెమ్ము||

జనములు నీ వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు (2)
రాజులు నీదు ఉదయ (2)
కాంతికి వచ్చెదరు (2)      ||లెమ్ము||

లెమ్ము తేజరిల్లుము అని

లెమ్ము తేజరిల్లుము అని

నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)

నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు

రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని

నిను వేనోళ్ళ ప్రకటించెద (2)


ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి (2)
ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ       ||లెమ్ము||

శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి (2)
ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
ఇదియే నా ధన్యత        ||లెమ్ము||

తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము (2)
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే (2)
ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము     ||లెమ్ము||

లెక్కింపగ తరమా నీ మేలులు

లెక్కింపగ తరమా నీ మేలులు

వివరింపగ తరమా నీ కార్యములు (2)

నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము

నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2)    ||లెక్కింపగ||


నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి (2)
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2)     ||లెక్కింపగ||

నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి (2)
నీ దయయందు మనుష్యుల దయయందు
ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2)   ||లెక్కింపగ||

లెక్కించలేని స్తోత్రముల్

లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)

ఇంత వరకు నా బ్రతుకులో (2)

నువ్వు చేసిన మేళ్ళకై           ||లెక్కించలేని||


ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్         ||లెక్కించలేని|| 

అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును             ||లెక్కించలేని|| 

నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశమున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్          ||లెక్కించలేని||

లాలి లాలి జోలాలి

లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి

కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2)

లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2)

మాదు తండ్రికి మా లాలి (2)     ||లాలి||


చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2)
మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)     ||లాలి||

దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని (2)
సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)      ||లాలి||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...