Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Monday, 4 May 2026

జ్యోతిర్మయుడా…. నా ప్రాణ ప్రియుడా

జ్యోతిర్మయుడా…. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే…..
నా ఆత్మలో అనుక్షణం ... నా అతిశయము నీవే

నా ఆనందము నీవే……నా ఆరాధనా నీవే llజ్యోతిll


1. నా ... పరలోకపు తండ్రీ ... వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షవల్లితో  -  నను అంటుకట్టి స్థిరపరచావా llజ్యోతిll


2. నా ... పరలోకపు తండ్రీ……. నా మంచి కుమ్మరి
  నీ కిష్టమైన పాత్రను చేయ  -  నను విసిరేయక సారెపై నుంచావా llజ్యోతిll


3. నా ... తండ్రి కుమారా పరిశుద్దాత్ముడా
  త్రియేకదేవా ఆదిసంభూతుడా -  నిను నేనేమని ఆరాధింతును llజ్యోతిll

జై జై యేసురాజ జై జై

జై జై యేసురాజ జై జై - రాజాధిరాజ నీకే జై జై ll జై ll


1. పాపకూపములోబడియున్న - నన్ను జూచి
    చేయి జాచి చక్కగా దరికి జేర్చితివి ll జై ll


2. సిలువ రక్తములో నన్ను కడిగి -  పాపమంతా
  పరిహరించిన - పావనుడగు నా ప్రభు యేసు ll జై ll


3. నీతిహీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
    ప్రీతితో నొసగిన నీతిరాజ ll జై ll


4. మంటిపురుగునైన నన్ను -  మంటినుండి మింట
    జేర్చిన - మహాప్రభుండా నీకే జై జై ll జై ll


5. పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీస్వకీయ
    సంపాద్యముగ మార్చితివి ll జై ll


6 రాజులైన యాజకగుంపులో -  నన్నుగూడ నీ సొతైన
  పరిశుద్ధ జనములో జేర్చితివి ll జై ll


7. తల్లియైన మరచిన మరచును  - నేను నిన్ను
    మరవననిన నమ్మకమైన నా ప్రభువా ll జై ll


8. అధిక స్తోత్రార్హుడవైన -  ఆది అంతములేని స్వామి
    యుగయుగములకు నీకే జై జై ll జై ll

జుంటె తేనె ధారలకన్న మధురమైనది

జుంటె తేనె ధారలకన్న మధురమైనది  - మంచి ముత్యాలకన్న విలువైనది (2)
పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ - శాశ్వతకాలం నిను ప్రేమించు ప్రేమ


అ.ప. సిలువ ప్రేమ కలువరి ప్రేమ (2) ॥జుంటె॥


1. బంధువులకన్న బహు విలువైన ప్రేమ- స్నేహితుల కన్న మరి శ్రేష్టమైన ప్రేమ(2)
    విలువైన ప్రేమ నిన్ను వీడని ప్రేమ (2)- సిలువ ప్రేమ కలువరి ప్రేమ    ॥సిలువ॥


2. ధన ధాన్యలకన్న ధన్యమైన ప్రేమ రత్నరాసులకన్న రమ్యమైన ప్రేమ (2)
    బలమైన ప్రేమ రక్తమిచ్చిన ప్రేమ-సిలువ ప్రేమ కల్వరి ప్రేమ (2)        ॥సిలువ॥

జీవించుచున్నాడు యేసుప్రభూ

జీవించుచున్నాడు యేసుప్రభూ -  నా హృదయములో నున్నాడు
కష్టములలో నా సహాయుడై   -  నిత్యము జీవించును ||జీవి||


1. మాటచే సాగరము పాయలైపోయె -  కోట గోడలు కూలి మట్టమైనవి
    గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే  -  కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభు ముట్టగా   ॥జీవి॥


2. మాటచే నీళ్ళను రసముగ మార్చ -  మాటచే సూచక క్రియలు జరిగె
    మాటచే సముద్రము పొంగు అణిగెన్ -  మాటచే తుఫాను ఆపబడెను       ॥జీవిll


3. సుఖారి పురమున సమరయ స్త్రీ  - పాపము విడిచెను ప్రభు మాటచే
  పాపముల్ క్షమించబడే యేసు మాటచే -  సిలువపై దొంగ రక్షింపబడెను     ॥జీవిll


4. దేవాలయపు తెర క్రింద వరకు - రెండుగ చినిగెను ప్రభు కేకచే
    భూమి వణికి బండలు బ్రద్దలాయె - సమాధుల్ తెరవబడె యేసు మాటచే ॥జీవి॥


5. నన్ను వదలక పట్టుకొనుము -  నిన్ను విడువక వెంబడింతును
    మరణించు వేళ పరలోకపు -  ఇంటికి నడుపు విమోచకుడా ॥జీవి॥

జీవిత యాత్రలో నాదు గురి నీవెగా

జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటి యెవ్వరు యేసువా నీవు
నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా ||జీవిత||


1. నన్ను నడిపించు చుక్కాని నీవెగదా - నన్ను కాపాడు దుర్గంబు నీవెగదా
    నీదు వాక్యంబు సత్యంబెగా - నాకు నిరతంబు జీవంబెగా
    నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా ॥జీవిత॥


2. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే -  నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే
  నాకు నీవేగా సర్వస్వమూ నీదు నామంబె ఆధారము
  నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతియింతునో యేసువా ॥జీవిత॥


3. నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా  -  నీదు చిత్తంబునే చేయ ముదమాయెగా       
    నాదు హృదయాన లెక్కింతునా -  నీదు ఉపకారములు యేసువా
    వీటి కొరకేమి చెల్లింతునూ -  నాదు స్తుతులందుకో యేసువా ॥జీవిత॥

జీవితమంత నీప్రేమ గానం

జీవితమంత నీప్రేమ గానం - ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ - ఆనందగానంబుతో


1. సర్వ సమయములలో నీ స్తుతి గానం- ఎల్లవేళలయందు
    నీ నామ ధ్యానం - మా కదియే మేలు- ఈ జీవితమున
    స్తుతియింతు మా రక్షకా ॥జీవిత॥


2. సృష్టినంతటిని నీ మాటచేత - సృజియించితివిగా
  మా దేవ దేవా - నీ ఘనమగు మహిమ వర్ణింప
  తరమా - స్తుతియింతు నా రక్షకా ॥జీవిత॥


3 కలుపాతులమైన మా కొరకు నీ - విలువైన ప్రాణంబు నర్పించితివిగా
  కలువరి గిరిపై -  చూపిన ప్రేమన్ - స్తుతియింతు నా రక్షకా ॥జీవిత॥


4. పరిశుద్ధమైన నీ సన్నిధిలో - శాశ్వతమైన నీ రాజ్యంబులో
    ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా  - స్తుతియింతు నా రక్షకా ॥జీవిత॥

జీవితాంతము వరకు నీకే

జీవితాంతము వరకు నీకే - సేవ సల్పుదునంటిని=నీవు
నాతోనుండి ధైర్యము - నిచ్చి నడుపుము రక్షకా


1. ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన=
    అన్ని పోవును నీవు నాకడ - నున్న నిజమిది రక్షకా ॥జీవితా॥


2. అన్ని వేళల నీవు చెంతనె - యున్న యను భవమీయవె=
  తిన్నగా నీ మార్గమందున  - పూని నడచెద రక్షకా ॥జీవితా॥


3. నేత్రములు మిరుమిట్లుగొలిపెడి - చిత్రదృశ్యములున్నను=
    శత్రువగు సాతాను గెల్వను చాలు నీకృప రక్షకా ॥జీవితా॥


4. నాదు హృదయమునందు వెలుపట- నావరించిన శత్రులన్=
    చెదరగొట్టుము రూపుమాపుము -  శీఘ్రముగ నా రక్షకా ॥జీవితా॥


5. మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే =
    ఇహము దాటినదాక నిన్ను  -  వీడనంటిని రక్షకా ॥జీవితా॥


6. పాప మార్గము దరికిబోవక - పాత యాశల గోరక =
  ఎపుడు నిన్నే వెంబడింపగ -  కృప నొసంగుము రక్షకా ॥జీవితా॥

- సేవ సల్పుదునంటిని=నీవు
నాతోనుండి ధైర్యము - నిచ్చి నడుపుము రక్షకా


1. ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన=
    అన్ని పోవును నీవు నాకడ - నున్న నిజమిది రక్షకా ॥జీవితా॥


2. అన్ని వేళల నీవు చెంతనె - యున్న యను భవమీయవె=
  తిన్నగా నీ మార్గమందున  - పూని నడచెద రక్షకా ॥జీవితా॥


3. నేత్రములు మిరుమిట్లుగొలిపెడి - చిత్రదృశ్యములున్నను=
    శత్రువగు సాతాను గెల్వను చాలు నీకృప రక్షకా ॥జీవితా॥


4. నాదు హృదయమునందు వెలుపట- నావరించిన శత్రులన్=
    చెదరగొట్టుము రూపుమాపుము -  శీఘ్రముగ నా రక్షకా ॥జీవితా॥


5. మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే =
    ఇహము దాటినదాక నిన్ను  -  వీడనంటిని రక్షకా ॥జీవితా॥


6. పాప మార్గము దరికిబోవక - పాత యాశల గోరక =
  ఎపుడు నిన్నే వెంబడింపగ -  కృప నొసంగుము రక్షకా ॥జీవితా॥

జీవితంబు ఘోర కష్టనష్టంబుల్

1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ - ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
  దేవుడిచ్చినట్టి ఈవులెంచుము - నీ వాశ్చర్య మొందెదవు వానికై


అ.ప.   ఎంచుము లెక్కించు మీవులన్ - ఎంచిచూడు మేసుదీవెనల్
          ఎంచు మెంచు మెంచు మీవులన్ - వింత నొందెదవు నీవు వానికై


2. చింత మానసంబు నీకు గల్గినన్ -  వంతచే భారంబు గల్గ నీ యెదన్
    సంతసంబుతోడ నెంచు మీవులన్  - వింత నొందెదవు నీవు వానికై


3. నాశనంబు జెందు నాస్తి జూడగా - వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన
  భాసురంపు భాగ్యముం దలంపుమా - యీ సౌభాగ్యమే గదా సదా యుండు


4. జీవితాదియందు ధైర్య మొందుము - దేవుడుండు నెల్లవార్కి తోడుగ
  జీవయాత్ర యందు సాయమియ్యగన్ - దేవదూతల్ నీకు తోడుగా నుండు

జీవనదిని నా హృదయములో

జీవనదిని నా హృదయములో- ప్రవహింప జేయుమయా (2)


1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయా (2) llజీవll


2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయా (2)    llజీవll


3. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2)     llజీవll


4. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా (2)    llజీవll


5. ఆత్మీయ ఫలములను నాలో ఫలియింపచేయుమయా (2)  ॥జీవ॥


6. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్         llజీవll

జయహే జయహే

జయహే జయహే జయహే జయహే
జయ జయ దేవసుత జయ జయ విజయసుతా ॥జయహే॥

1. సిలువలో పాపికి విడుదల కలిగెను -  విడుదల కలిగెను
    కలువరిలో నవజీవన మొసగెను - జీవన మొసగెను
    సిలువ పతాకము జయమును గూర్చెను
    జయమని పాడెదను - నా విజయము పాడెదను (2) ॥జయహే॥


2. మరణపు కోటలో మరణమె సమసెను -  మరణమె సమసెను
  ధరణిలో జీవిత భయములు దీరెను -  భయములు దీరెను
  మరణములో సహా జయములు నావే
  జయమని పాడెదను నా విజయము పాడెదను (2)   ॥జయహే॥


3. శోధనలలో ప్రభుసన్నిధి దొరికెను -  సన్నిధి దొరికెను
    వేదనలే రణభూమిగ మారెను  -  భూమిగ మారెను

   శోధన బాధలు బలమును గూర్చెను
    జయమని పాడెదను నా విజయము పాడెదను (2)   ॥జయహే॥


4. ప్రార్థన కాలము బహు ప్రియమాయెను -  బహు ప్రియమాయెను
  సార్ధకమాయెను దేవుని వాక్యము -  దేవుని వాక్యము
  ప్రార్థనలే బలిపీఠము లాయెను
  జయమని పాడెదను నా విజయము పాడెదను (2)   ॥జయహే॥


5. స్వాంతములో నిజశాంతి లభించెను శాంతి లభించెను
    భ్రాంతులు వింతగ ప్రభు పరమాయెను ప్రభు పరమాయెను
  స్వాంతమే సిలువకు సాక్షిగ వెలసెను
  జయమని పాడెదను నా విజయము పాడెదను (2)


6. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను
  వరుడగు యేసుని వధువుగా మారితి వధువుగ మారితి
  పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను
  జయమని పాడెదను నా విజయము పాడెదను (2) IIజయహేll

జయశీలుడా మా యేసయ్య

జయశీలుడా మా యేసయ్య - జీవించువాడా మెస్సయ్య (2)
జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణప్రియుడా వందనం
అ….  అ….  అ….  హల్లెలూయ   అ… హల్లెలూయ


1. బలమిచ్చువాడా బలవంతుడా - శక్తినిచ్చువాడా శక్తిమంతుడా
    తృప్తినిచ్చువాడా తనయులకు - ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా (2)
  మాకై మరలా రానుంటివా - యేసు మాకై మరలా రానుంటివా (2) ॥జయ॥


2 ఆదియు అంతం నీవేగా - ఆరాధ్యుడవు నీవేగా
  అత్యున్నతుడా అతి ప్రియుడా -  ఆత్మ స్వరూపి ఆశ్రయుడా (2)
  అనిశం నిన్నే కీర్తింతుము - యేసు అనిశం నిన్నే కీర్తింతుము (2) ॥జయ॥


3. నీవే దిక్కని నమ్మితిమి -  నిన్నే గురిగా ఎంచితిమి
  నీవే మాకు తండ్రివి - నీకు సమస్తం సాధ్యమే (2)
  నీపై సర్వం మోపితిమి యేసు నీపై సర్వం మోపితిమి (2) ॥జయ॥

జయరాజు యేసు జెండ క్రింద

జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి - భయము లేక
పరమ బలమొంది మనము పనిని జేయుదము


అ.ప. జయగీతము పాడి యుద్ధము జేసి - జయము నొందెదము


1. సేననాయకుడు నడిపించెను - మమ్మును దివ్యజ్ఞానముతో
    దీన సేవకులమై దినమును వెంబడించి  -  పనిని చేయుదము


2. దేశవాసులెల్లరు దేవునితో - సహవాస మొందుటకై  -  వంచించు
    సైతాన్ వలనుండి వారిని -  విడిపించుట మా పని


3. హిందూదేశ మంతయు నెప్పుడు యేసుకు - స్వంతమగుచున్నదో
    అంధకారము తొలగి వెలుగొందు కాలము  -   త్వరలో రావలెను

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...