Showing posts with label స్తుతి-ఆరాధన. Show all posts
Showing posts with label స్తుతి-ఆరాధన. Show all posts

Thursday, 5 March 2026

హోసన్నా హల్లెలూయా

హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్
నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2)    ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2)      ||హోసన్నా||

హోసన్న హోసన్నా యూదుల రాజుకే

నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను
నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్ (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరుదును (2)
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరి చేసితివే (2)
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయూ (2)
నా తుది శ్వాస విడచే వరకు
నీ పేరే ప్రకటించాలని (2)

హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

హోసన్ననుచూ స్తుతి పాడుచూ

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
హోసన్నా… హోసన్నా… (4)                 ||హోసన్ననుచూ||

ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం (2)       ||హోసన్నా||

మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము (2)     ||హోసన్నా||

ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం (2)   ||హోసన్నా||

హల్లేలూయా యని పాడి స్తుతింపను

హల్లేలూయా యని పాడి స్తుతింపను

రారే జనులారా మనసారా ఊరూరా

రారే జనులారా ఊరూరా నోరారా        ||హల్లేలూయా||


పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)
కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)
తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే     ||హల్లేలూయా||

బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)
అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)
కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే     ||హల్లేలూయా||

రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే     ||హల్లేలూయా||

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి            ||రాజుల||

సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు  కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి     ||రాజుల||

యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి             ||రాజుల||

అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి            ||రాజుల||

హల్లెలూయా ఆరాధన రాజాధి రాజు యేసునకే

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం         ||హల్లెలూయా||

రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2)      ||చప్పట్లు||

అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2)     ||చప్పట్లు||

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా (2)

మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2)  ||హల్లెలూయ||

సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో (2)              ||మహిమా||

కొండలలో లోయలలో
జీవులలో ఆ జలములలో (2)         ||మహిమా||

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
యుగయుగముల నిత్యుడా (2)      ||మహిమా||

హల్లెలూయ స్తుతి మహిమ

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)     ||హల్లెలూయ||

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)    ||హల్లెలూయ||

హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో

హల్లెలూయ పాటలతో
ఆనంద గీతాలతో (2)
కృపామయుండా నీ మేలులన్ని
స్మరించి స్తుతింతును (2)

నేనారణ్యా యానములో
నిను పలుమార్లు విసిగించినా (2)
కోపించుచునే వాత్సల్యము చూపి
అనుదినము నను మరువక
మన్నాను నాకిడితివి (2)      ||హల్లెలూయ||

మలినంబైన వలువలతో
నే నీ ఎదుట నిలుచుండగా (2)
కృపతో నా నేరములను క్షమియించి
పరిశుద్ధ వస్త్రములతో
నన్నలంకరించితివి (2)      ||హల్లెలూయ||

నే కృంగిన వేళలలో
నీ అభిషేక తైలముచే (2)
పక్షిరాజు యవ్వనము వలె నా బలము
నూతనము జేసితివి
నను పైకెగుర జేసితివి (2)   ||హల్లెలూయ||

హల్లెలూయ పాట – యేసయ్య పాట

హల్లెలూయ పాట – యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)              ||హల్లెలూయ||

కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)   ||హల్లెలూయ||

చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)  ||హల్లెలూయ||

నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)   ||హల్లెలూయ||

శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||

సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2)
ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2)         ||హల్లెలూయ||

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో

ఆస్వాదింతును నీ మాటల మకరందము   ||సుగుణాల||


యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే             ||సుగుణాల||

యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో          ||సుగుణాల||

యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే                ||సుగుణాల||

సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను

సర్వశక్తుని స్తోత్రగానము

సల్పరే జగమెల్లను

నిర్వహించును దాస భారము

నిత్యమెద రాజిల్లను (2)          ||సర్వ||


ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే (2)          ||సర్వ||

వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే (2)   ||సర్వ||

ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే (2)      ||సర్వ||

చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును (2)       ||సర్వ||

దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే (2)         ||సర్వ||

సర్వకృపానిధియగు ప్రభువా

సర్వకృపానిధియగు ప్రభువా

సకల చరాచర సంతోషమా (2)

స్తోత్రము చేసి స్తుతించెదను

సంతసముగ నిను పొగడెదను (2)


హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను

ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధముగా జీవించుటకై
పాపిని నను కరుణించితివి (2)      ||హల్లెలూయా||

అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి (2)    ||హల్లెలూయా||

మరణ శరీరము మర్పునొంది
మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి
మరణ భయములను తీర్చితివి (2)  ||హల్లెలూయా||

భువినుండి శ్రేష్ట ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను
ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)    ||హల్లెలూయా||

ఎవరూ పాడని గీతములు
యేసుతో నేను పాడుటకై  (2)
హేతువు లేకయే ప్రేమించెన్‌
యేసుకు నేనేమివ్వగలన్‌ (2)        ||హల్లెలూయా||

సమానులెవరు ప్రభో

సమానులెవరు ప్రభో

నీ సమానులెవరు ప్రభో (2)

సమానులెవరు ప్రభో


సమస్త మానవ శ్రమాను భవమును (2)

సహించి వహించి ప్రేమించగల (నీ) (2)        ||సమానులెవరో||


సమాన తత్వము – సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2)  ||సమానులెవరో||

పరార్ధమై భవ – శరీర మొసగిన (2)
పరోపకారా నరావ తారా (నీ) (2)               ||సమానులెవరో||

దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2)
నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2)            ||సమానులెవరో||

ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2)
పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2)   ||సమానులెవరో||

స్వఛ్చంద సీయోను వాసి

స్వఛ్చంద సీయోను వాసి

సర్వాధికారి – కస్తూరి పూరాసి (2)

వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)

అల్ఫా ఒమేగ తానే (2)

ఆద్యంతము మన యేసే (2)         ||స్వఛ్చంద||


ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)
పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)
లెక్క లేని యద్భుతముల్ (2)
మక్కువతో చేయువాడు (2)          ||స్వఛ్చంద||

సంగీతం నాదముల తోడ
సీయోను పురము – సొంపుగను చేరితిమి (2)
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)
దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)
మిక్కిలి ఆనందము కల్గెన్ (2)         ||స్వఛ్చంద||

నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో – మాణిక్య మణులతో (2)
సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2)
ప్రశస్త రత్నములతో (2)
ప్రవిమలముగా నిను గట్టెదను (2)   ||స్వఛ్చంద||

సుమముల హారము
సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2)
ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2)
హిత వత్సరము విముక్తి (2)
ఆత్మాభిషేకము నీదే (2)               ||స్వఛ్చంద||

జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2)
నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2)
అగ్ని మధ్యను నడచినను (2)
జ్వాలలు నిను కాల్చగ లేవు (2)    ||స్వఛ్చంద||

ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2)
అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2)
రహస్యములో మరుగైన (2)
ధనమును నీ కొసంగెదను (2)      ||స్వఛ్చంద||

గర్భమున పుట్టినది మొదలు
తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2)
నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2)
ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2)
ఎత్తుకొను వాడను నేనే (2)         ||స్వఛ్చంద||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...