కావలివాడా ఓ కావలివాడా

కావలివాడా ఓ కావలివాడా - కనులు తెరచి పొలమును చూడు
కోతకు వచ్చిన పంటను కోయుము .   ||కావలి||

1.పిలిచెను నీ యజమానుడు - జత పనివాడవై యుండుటకు.  (2)
కొలుచును నీ ఫలమంతమున - పని చేసిన రీతిగనే . (2)   ||కావలి||

2.నమ్మెను నీ యజమానుడు - అప్పగించెను తన స్వాస్థ్యము.  (2)
తిరిగి వచ్చును జీతమియ్యను - సిద్ధ పడుము ఇక నిద్ర మాని.  (2)   ||కావలి||

3.ఎంచెను నీ యజమానుడు - నీ పాదములు సుందరములని.  (2)
ఉంచెను కర్మెలు పర్వతముపై - పరుగిడుము పరాక్రమ శాలివై.  (2)   ||కావలి||

4.వేయుము పునాది నేర్పరివై - చెక్కుము రాళ్లను శిల్ప కారివై.  (2)
కొయ్య కాలును కర్ర గడ్డియు - కాలిపోవును అగ్ని పరీక్షలో.  (2)   ||కావలి|| Kaavalivaadaa o kaavalivaadaa - kanulu terachi polamunu choodu Kotaku vachchina pantanu koyumu . ||kaavali|| 1.pilichenu nee yajamaanudu - jata panivaadavai yundutaku. (2) Koluchunu nee phalamantamuna - pani chesina reetigane . (2) ||kaavali|| 2.nammenu nee yajamaanudu - appaginchenu tana svaasthyamu. (2) Tirigi vachchunu jeetamiyyanu - siddha padumu ika nidra maani.(2) ||kaavali|| 3.enchenu nee yajamaanudu - nee paadamulu sundaramulani. (2) Unchenu karmelu parvatamupai - parugidumu paraakrama shaalivai (2)||kaavali|| 4.veyumu punaadi nerparivai - chekkumu raallanu shilpa kaarivai. (2) Koyya kaalunu karra gaddiyu - kaalipovunu agni pareekshalo. (2) ||kaavali||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు