Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, 3 May 2026

ఈ సాయంకాలమున

ఈ సాయంకాలమున - యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క- నిత్యంబు మముగావు II ఈ II


1. చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి కనులన్ =
    బిడ్డలము రాత్రిలో - భీతిబాపుము తండ్రీ          ॥ఈ॥

2. దుష్టుండౌ శోధకుని - ద్రొక్కుటకు బలమిమ్ము=
  భ్రష్టత్వమున మేము - పడకుండ కాపాడు II ఈ II


3. నీ యేక పుత్రుండౌ - శ్రీయేసు నామమున =
    సాయం ప్రార్ధన లెల్ల- సరగ నాలి II ఈ II


4. జనక సుత శుద్ధాత్మ- ఘనదేవా స్తుతియింతుం=
    అనిశము జీవించి రాజ్యంబు జేయు మామేన్   II ఈ II

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

 ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధా
అ.ప.      గాలి తుఫానులను గలిగే తరంగముల  -  గొట్టబడుచున్నాను గదా నా దేవా


1. సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబురావా
    సారాకరుణారసధారలే నా కొసగుము - సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము


2. సంఘ సంబంధముగ శాంతి లేకపోయె - సమానతత్వంబు సమసిపోయె
    సోదరులే నాకు శత్రువులయ్యిరి -  సమాధానము నొసగ సరగునరావా


3. బయట పోరాటములు -భయపెట్టుచుండెను -బంధువులందరు బహుదూరులైరి  
    భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె - బాధలన్నియు బాప బహుత్వరగ రావా


4. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె - రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండె
  రాజులకు రాజువై రయమున రావయ్య - రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము

5. సైతాను చెలరేగి సమయం బిక లేదని - సింహపురీతిగా గర్జించుచుండె
  సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి - సమాధానరాజ్యం -  స్థాపించరావా

Sunday, 28 December 2025

ఈ దినం సదా నా యేసుకే సొంతం

 " ఈ దినం సదా నా యేసుకే సొంతం

నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును " (2)
రానున్న కాలము – కలత నివ్వదు. (2)
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును.    ||ఈ దినం||

ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను. (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము. (2)
గాయపడిన యేసుపాదం అందు నడచెను. (2)   ||ఈ దినం||

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే. (2)
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు. (2)
యెహోవా నిస్సియే నాదు విజయము.     ||ఈ దినం||

ఈ జీవితం విలువైనది

 "ఈ జీవితం విలువైనది

నరులారా రండని సెలవైనది" (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు.       ||ఈ జీవితం||

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు. (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా. (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా .(2)   ||ఈ జీవితం||

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు. (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి. (2)  ||ఈ జీవితం||

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు. (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు. (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు, (2)   ||ఈ జీవితం||


Tuesday, 23 December 2025

ఈలాటిదా యేసు ప్రేమ

 "ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను

తూలనాడక తనదు జాలి చూపినదా "    ||ఈలాటిదా||

ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె.     ||ఈలాటిదా||

పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె.       ||ఈలాటిదా||

నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె.     ||ఈలాటిదా||

పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె.  ||ఈలాటిదా||

నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు.      ||ఈలాటిదా||


Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...