Showing posts with label పశ్చాత్తాపం. Show all posts
Showing posts with label పశ్చాత్తాపం. Show all posts

Thursday, 5 March 2026

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)   ||హృదయ||

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)         ||హృదయ||

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)          ||హృదయ||

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)  ||హృదయ||

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)        ||హృదయ||

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)        ||హృదయ||

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2)                 ||హృదయ||

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2)      ||హృదయ||

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2)                ||హృదయ||

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2)           ||హృదయ||

హల్లే హల్లే హల్లే హల్లేలూయా

హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల (2)     ||హల్లే||

నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే (2)     ||నిను||

నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2)       ||నిను||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...