కృపా క్షేమము నీ శాశ్వత జీవము
“ కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు ” (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా.
1.నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి. (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే. (2)
ఆరాధన నీకే. ||కృపా క్షేమము||
2.నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి. (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను. (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే. (2)
ఆరాధన నీకే. ||కృపా క్షేమము||
3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని. (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా. (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే. (2)
ఆరాధన నీకే. ||కృపా క్షేమము||
“ krupaa kshemamu nee shaashvata jeevamu
Naa jeevita kaalamantayu neevu dayacheyuvaadavu ” (2)
Mahonnatamaina nee upakaaramulu
Talanchuchu anukshanamu paravashinchanaa
Nee krupalone paravashinchanaa.
1.naa prati praardhanaku neevichchina eevule
Lekkaku minchina deevenalainaayi. (2)
Adugulu tadabadaka nadipinadi nee divya vaakyame
Kadalini minchina vishvaasamunichchi vijayamu chekoorchenu. (2)
Nee vaakyame makarandhamai balaparichenu nannu
Naa yesayya stutipaatruda aaraadhana neeke. (2)
Aaraadhana neeke. ||krupaa kshemamu||
2.nee satya maargamulo phalinchina anubhavame
Parimalimpachesi saakshiga nilipaayi. (2)
Kalatachendaka nilipinadi nee divya darshaname
Gamyamu chere shaktito nanu nimpi nootana krupanichchenu. (2)
Aaraadhyudaa abhishiktudaa aaraadhana neeke
Naa yesayya stutipaatruda aaraadhana neeke. (2)
Aaraadhana neeke. ||krupaa kshemamu||
3.naa praana priyudaa nannelu mahaaraajaa
Naa hrudi nee koraku padilaparachitini. (2)
Boorashabdamu vinagaa naa bratukulo kalalu pandagaa
Avadhululeni aanandamuto nee kaugili ne cheranaa. (2)
Aaraadhyudaa abhishiktudaa aaraadhana neeke
Praaneshvaraa naa yesayya aaraadhana neeke. (2)
Aaraadhana neeke. ||krupaa kshemamu||
Comments
Post a Comment