ఆశ్చర్యములు - నీకార్యములు - దేవుని కార్యము లాశ్చర్యములు
1. యేసు నామము నెరిగిన బిడ్డలు - ఏక మనస్సుతో ప్రార్ధించగా
పరిశుద్ధాత్మతో నిండినవారై - దేవుని కార్యముల్ వివరించిరి II ఆశ్చII
2. యేసునెరిగిన యోహాను పేతురు - యేసు నామమున్ ప్రార్ధించగా
కుంటివాడు దిగ్గున లేచెను - నడచుచూ దేవుని స్తుతియించెను II ఆశ్చII
3. యేసు నెరిగిన పౌలు సీలలు - యేసు వార్తను ప్రకటించుచు
పట్టణములను గలిబిలి చేసిరి - ప్రజలను కలవరపరచిరి II ఆశ్చII
4. చెరలో పేతురు బంధించబడి - సంఘమంతా ప్రార్ధించగా
దేవుని దూత విడిపించెను - సైనికులలో గలిబిలి రేగెను II ఆశ్చII