1. ఒకనాడు పాపినై బ్రతికి - ప్రియ యేసుని ప్రేమను మరచి
మనసు దేహము కోరినదే చేసి - మనశ్శాంతిని కోల్పోతిన్ (2)
లోకమందు శాంతి లేదుగా పాపజీవితం మాయారా (2)
దైవచిత్తం చేయుటే నా జీవితాశయం (2)
2. లోక స్నేహము అనిత్యం పగయేగా దాని స్వరూపం
లోక స్నేహము దేవునితో వైరం అని గ్రహించుటే సత్యం ॥లోక॥
3. సాతాను వలలో చిక్కి నా మనసును నే చెడగొట్టి
నిరాశ నన్ను పూర్తిగ ఆవరింప దిక్కు తెలియని వాడనైతి ||లోక॥
4. నా యేసు ముఖమును చూచి నా పాపములకు క్షమ పొంది
రక్షణ కార్యము సఫలము చేయగా సంపూర్తిగ సమర్పించితి ||లోక॥
5. తన ప్రేమతో నను నింపి తన సేవను చేయ పిలచి
మహిమలో చేర్చుకొను దినము వరకు నను దీనునిగా కాచున్ ॥లోకll