కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది - తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది - నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా. (2) ||కాలం||
1.ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా. (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు . (2) ||ఆగవేమయ్యా||
2.చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు. (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు . (2) ||ఆగవేమయ్యా||
3.సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు. (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు. (2) ||ఆగవేమయ్యా||
Kaalam samayam naadenantoo anukuntunnaavaa
Rojulu anni naavenantoo jeevistunnaavaa (2)
Devuni mundu niliche rojundi - takkeda tookam vese rojundi (2)
Jeeva grantham teriche rojundi - nee jeevita lekka cheppe rojundi
Aagavemayyaa ee maata vinavayyaa
Aagavemayyaa nee manassu maarchukovayyaa. (2) ||kaalan||
1.dhanamu balamu unnadani virraveegutunnaavaa
Medalu middelu unnaayani anukuntunnaavaa. (2)
Gujaraatunu choodavayyaa enta ghoramo
Okka ghadiyalendaro bikaarulayyaaru . (2) ||aagavemayyaa||
2.choosaavaa bhookampaalu karuvulu vipareetaalu
Parishuddha granthamuloni kadavari kaalapu soochanalu. (2)
Ninnati varaku koduva ledani anukunnaaru
Okka ghadiyalo endaro nashinchipoyaaru . (2) ||aagavemayyaa||
3.siddhapadina vaari kosam paralokapu dvaaraalu
Siddhapadani vaariki aa narakapu dvaaraalu. (2)
Agni aaradu purugu chaavadu
Nityam edupu duhkhaalu. (2) ||aagavemayyaa||
Comments
Post a Comment