దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి - అ…...అ…….
1. ఆయన పరిశుద్ద ఆలయమందు ఆయన సన్నిధిలో
ఆ...... ఆయన సన్నిధిలో యెల్లప్పుడు ॥దేవుని॥
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు
ఆ........ఆకాశ విశాలమందు యెల్లప్పుడు ॥దేవుని॥
3. ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును
ఆ…….. .ఆయన ప్రభావమును యెల్లప్పుడు ॥దేవుని॥
4. బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలములతో
ఆ.......సర్వమండలములతో యెల్లప్పుడు ॥దేవుని॥
5. సన్నని తంతుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ.....చక్కని స్వరములతో యెల్లప్పుడు ॥దేవుని॥
6. తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో
ఆ.......తంతి వాయిద్యములతో యెల్లప్పుడు ॥దేవుని॥
7. పిల్లన గ్రోవిని చల్లగ నూది యెల్ల ప్రజలు చేరి
ఆ...... యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు ॥దేవుని॥
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి - గంభీర తాళముతో
ఆ..... గంభీర తాళముతో యెల్లప్పుడు ॥దేవుని॥
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయ ఆమెన్
ఆ....హల్లెలూయ ఆమేన్ యెల్లప్పుడు ॥దేవుని॥