Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Thursday, 5 March 2026

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా

సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2)      ||శోధనా||


నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2)
చూచెనే యేసు చెంతకు చేరెనే (2)
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2)      ||శోధనా||


పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2)
చూచెనే యేసు చేయి చాచెనే (2)
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2)      ||శోధనా||

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

భజియించి నే పొగడనా స్వామీ (2)

శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం

హల్లేలూయా హల్లేలూయా

హల్లెలూయ హల్లెలూయ హల్లేలుయా (2)  ||శృతిచేసి||


దానియేలును సింహపు బోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా (3)          ||హల్లేలూయా||


సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవెకదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా (2)
నీవెకదా (3)         ||హల్లేలూయా||

శుభవేళ – స్తోత్రబలి

శుభవేళ – స్తోత్రబలి

తండ్రీ దేవా – నీకేనయ్యా

ఆరాధన – స్తోత్రబలి

తండ్రీ దేవా – నీకేనయ్యా

తండ్రీ దేవా – నీకేనయ్యా (2)   ||శుభవేళ||


ఎల్ షడ్డాయ్ – ఎల్ షడ్డాయ్ – సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా – ఎల్ షడ్డాయ్ ఎల్ షడ్డాయ్ (2)  ||శుభవేళ||


ఎల్ రోయి – ఎల్ రోయి – నన్నిల చూచువాడా (2)
నన్నిల చూచువాడా – ఎల్ రోయి ఎల్ రోయి (2)       ||శుభవేళ||

యెహోవా షమ్మా – మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా – యెహోవా షమ్మా (2)                ||శుభవేళ||

యెహోవా షాలోం – శాంతి నొసగు వాడా (2)
శాంతి నొసగువాడా – యెహోవా షాలోం (2)              ||శుభవేళ||

శుద్ధ హృదయం కలుగజేయుము

శుద్ధ హృదయం కలుగజేయుము (3)

నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై ఉన్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా (2)

శుద్ధ హృదయం కలుగజేయుము (2)
నాలోనా నాలోనా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (3)

నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా (2)        ||శుద్ధ||

శుద్ధ రాత్రి! సద్ధణంగా

శుద్ధ రాత్రి! సద్ధణంగా

నందరు నిద్రపోవ

శుద్ధ దంపతుల్ మేల్కొనగా

బరిశుద్దుడౌ బాలకుడా!

దివ్య నిద్ర పొమ్మా

దివ్య నిద్ర పొమ్మా


శుద్ధ రాత్రి! సద్ధణంగా
దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకు దెలిపెను
ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను
క్రీస్తు జన్మించెను


శుద్ధ రాత్రి! సద్ధణంగా
దేవుని కొమరుడ
నీ ముఖంబున బ్రేమలొల్కు
నేడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే
నీవు పుట్టుటచే

శుద్దుడా ఘనుడా రక్షకుడా

శుద్దుడా ఘనుడా రక్షకుడా

నా కాపరి నీవే నా దేవుడా

శక్తి లేని నాకు బలమిచు వాడా

నా స్నేహితుడా బలవంతుడా


హర్షింతును నిన్ను ఆరాధింతును
స్తుతియింతును నే కీర్తింతును
శక్తి లేని నాకు బలమిచ్చు వాడా
నా స్నేహితుడా బలవంతుడా

రక్షణా ఆధారం నీవే
విమోచనా నీవే యేసయ్యా
నా స్నేహితుడా బలవంతుడా

శిలనైన నన్ను శిల్పివై మార్చావు

శిలనైన నన్ను శిల్పివై మార్చావు

నాలోని ఆశలు విస్తరింపచేసావు (2)

నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)

నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)    ||శిలనైన||


మోడుబారిన నా జీవితం
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)    ||శిలనైన||


ఏ విలువలేని అభాగ్యుడను నేను
నీ ప్రేమచూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతు ఇలలో (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)    ||శిలనైన||


ఊహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నా కాపరి (2)    ||శిలనైన||

శిరము మీద ముళ్ల సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా

కార్చిన కన్నీళ్ల సాక్షిగా

పొందిన గాయాల సాక్షిగా

చిందిన రుధిరంబు సాక్షిగా (2)

యేసు నిన్ను పిలచుచున్నాడు

నీ కొరకే నిలచియున్నాడు (3)


సర్వ పాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని (2)
మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని
పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం
యేసులోనే నెరవేరెనుగా


సర్వ పాప పరిహారో
రక్త ప్రోక్షణం అవశ్యం
తద్ రక్తం పరమాత్మేనా
పుణ్య దాన బలియాగం

ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ      ||శిరము||

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని (2)
కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం
క్రీస్తులోనే నెరవేరెనుగా

చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి
శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో
వృషభో రోర వీతి మహో దేవో
మద్యామ్ ఆవివేశత్తిథి

బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి
యేసులోనే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా   ||శిరము||

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

కృప చూపి నన్ను రక్షించవయ్యా (2)

నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది

నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)


అనాథనైనా నన్ను వెదకి వచ్చావు
ఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2)          ||నీ ప్రేమ||


అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2)         ||నీ ప్రేమ||

తల్లి గర్భమందు నన్ను చూచియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి (2)              ||నీ ప్రేమ||

నడుచుచున్న మర్గమంత యోచించగా
కన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2)  ||నీ ప్రేమ||

ప్రభువు చేయవలసినది ఆటంకం లేదు
సమస్తము మేలుకై చేసిన దేవా (2)         ||నీ ప్రేమ||

శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగా

కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత||


నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2)     ||శాశ్వత||


దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2)           ||శాశ్వత||

భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)     ||శాశ్వత||

సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2)       ||శాశ్వత||

నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)   ||శాశ్వత||

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా

నీ ప్రేమే నను గెల్చెను

విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా

నీ కృపయే నను మార్చెను

నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం

నీ ప్రేమ తేనె కంటే మధురము

నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా

నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా

ప్రేమతో… ప్రేమతో…

యేసయ్యా నిను వెంబడింతును

ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…

యేసయ్యా నిను ఆరాధింతును         ||శాశ్వతమైన||


నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
గ్రంధములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయములను
వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నీ కోసం సృజియించావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను మురిపెంగా లాలించావయ్యా        ||శాశ్వతమైన||


నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి
కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి
సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నను దర్శించినావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను ప్రత్యేకపరిచావేసయ్యా          ||శాశ్వతమైన||

నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
నా విలువని పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను
తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్యా… యేసయ్యా…
నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
నను నీలా మార్చేందులకేనయ్యా          ||శాశ్వతమైన||

పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నను మరలా సమకూర్చావేసయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా         ||శాశ్వతమైన||

కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
లోకమే మారిననూ మనుషులే మరచిననూ
మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
బంగారంలా మెరిపించావయ్యా          ||శాశ్వతమైన||

ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను చిరకాలం ప్రేమిస్తావయ్యా      ||శాశ్వతమైన||

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప

అనుక్షణం నను కనుపాపవలె (2)

కాచిన కృప          ||శాశ్వతమైనది||


నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2)       ||శాశ్వత||


తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2)      ||శాశ్వత||

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2)       ||శాశ్వత||

శాశ్వతమా ఈ దేహం

శాశ్వతమా ఈ దేహం

త్వరపడకే ఓ మనసా…

శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా (2)


క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె – (2)
దేహము ఏ వేళా చితికిపోవునో      ||శాశ్వతమా||


ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా – (2)
నీ గతి ఏమో నీకు తెలియునా      ||శాశ్వతమా||

దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో – (2)
చిరజీవముతో తరియించేవు       ||శాశ్వతమా||

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...