అహా సహోదరులందరూ ఐక్యతతో నుంటే
ఎంతయో మేలు ఎంత మనోహరం ఎంతో ఆనందము
హల్లెలూయ ఆమెన్... హల్లెలూయ ఆమెన్...
హల్లెలూయ ఆమెన్... హల్లెలూయ ఆమెన్...
1. అది అహరోను తలపై పోయబడి తన గడ్డముపై కారి
అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలము వలెనుండు II అహా II
2. అది సీయోను కొండలపై దిగు హెర్మోను మంచు వలెనుండు
ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండుననెను ప్రభువు II అహా II
3. చిరుకోపము సణుగుడు సరసోక్తులు వట్టిమాటలు విడచిపెట్టి
ఒకరిని ఒకరు క్షమించు కొనుచు యోగ్యులని ఎంచాలి II అహా II
4. యేసు ప్రేమించి తనదు ప్రాణము పెట్టి మనలను రక్షించెన్
ప్రాణమిదునంత ప్రేమను చూపుచు మనము కలిసి ఉండాలి II అహా II
5. ఆత్మ తీవ్రతతో అభిషేకముతో క్రీస్తు వార్తను జాటాలి
మాంద్యత వీడి ఆసక్తితో ప్రభు సేవను చేయాలి II అహా II