Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Sunday, 3 May 2026

ఓ మానవుండ నీగతి యేమౌనో

1. ఓ మానవుండ నీగతి యేమౌనో తెలియునా
    యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?......


.. ఆహా.... ఆ.... అంత్యతీర్పు నందున.... యేసూ నీ రక్షకుడే
  మహాభయంకరమౌ సింహంబుగా నుందు


2. లోకాలు పుట్టినప్పటి - నుండి మృతులైన
    ఏ కులజుడైన నాటికి - తీర్పులో నిలచును


3. మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను
    ప్రతివారు నిలిచియుందురు - బ్రతికిన రీతిగనే


4. గ్రంథాలు విప్పబడగ - గ్రంథాలలో వారి
  గ్రంధంబు బట్టబయలై - పొందుదురు తీర్పును


5. నరులెల్ల క్రియలచొప్పున - మరి తీర్పు పొందుదురు
    మరణము మృతుల లోకము గురియౌను అగ్నికి


6. ఈనాడు నీవు కూడను - యేసుని విడిచినచో
    ఆనాడు నీవు కూడాను - అందుండి ఏడ్చెదవు

7. దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును
    ఎవ్వాని పేరందుండదో - వాడగ్నిలో బడును

ఓ సోదరా, ఓ సోదరీ

ఓ సోదరా, ఓ సోదరీ - యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు
నిదురమాను మగతవీడు కన్ను విప్పి కలియచూడు (2)


1. యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి-ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి.
    ప్రార్ధనాయుధముతో పునరుత్థాన శక్తితో పునఃనిర్మాణం చేతము రండి


2. నిరాశ నిస్పృహలు ఎదురు నిలచిన- నిందలెన్ని మబ్బులుగ మనల క్రమ్మిన
  నిలిచెదం యేసుతో నడిచెదం దీక్షతో- నిరీక్షణ బలముతో సాగిపోదము


3. అపవాది బాణములు ఎన్ని విసిరిన  అగ్నిగంధకముల వానచుట్టు ముసిరిన
అదరము బెదరము - అరికి మనము వెరువము
అన్న యేసు సన్నిధిలో లేదిక భయము II ఓ సోదరా!|


4. సంఘమనగ క్రీస్తుయేసు దేహమే కదా - చావును ఓడించినదీ దేహమే కదా
సిలువ తేజస్సుతో కరుణమూర్తి మనస్సుతో
సిరులు విరియు జీవితాలు నిర్మిద్దాము II ఓ సోదరా!||


5. యేసే ఈ సంఘమునకు అసలు పునాది యేసే ఈ
    జగత్తునకు ఆశాజ్యోతి యేసే ఆరంభము ఆయనే అంతము
    యేసే మన జీవితాల నవ వసంతము (2) ॥ఓ సోదరా II


6. సాక్ష్యమిచ్చు సంఘమే - జీవించే సంఘము జీవించే సంఘమే
    సాక్ష్యమిచ్చు సంఘము సాక్ష్యము విశ్వాసము సత్యము
    సహవాసము సిలువ చలువ పందిరిలో వర్ధిల్లాలి (2) ||ఓ సోదరా|| 


7. శాంతి ధ్వజము మన ముందు నడుచుచుండగా సిలువ
  జ్యోతి మార్గమును చూపుచుండగ సాగనీ ఉద్యమం ఆగదు ఈ రధం
  యేసు రాజు సామ్రాజ్యం నిలుచును నిరతం (2) ॥ఓ సోదరా||


8. విజయమంత నిజముగ యేసు ప్రభునిదే కుజనుడైన సాతాను
    ఓడిపోవులే సృజనాత్మక శక్తితో సిలువత్యాగస్ఫూర్తితో
    స్వార్ధరహిత సేవలను సాగిద్దాము (2) ॥ఓ సోదరా||

ఓ సంఘమా - సర్వాంగమా

ఓ సంఘమా - సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా
మెస్సయ్యను ఎదుర్కొనగా - నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా


1. రాణి ఓఫీరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణా వాయిద్య
  తరంగాలలో - ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనందతైల
  సుగంధాభిషేకము - పొందితివా యేసు నందు ||ఓ సం||


2. క్రీస్తే నిను ప్రేమించెననీ - తన ప్రాణము - నర్పించెనని స్వస్థపరచె
  నిర్దోషముగ - ముడత కళంకము లేనిదిగా మహిమా యుక్తంబుగా
  నిలుపగోరె యేసువా - సహింతువా తీర్పునాడూ ||ఓ సం||


3. చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు
    శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని
    గుర్తించుచుంటివా క్రియలను గంటివా- సజీవముగా నున్నావా ॥ఓ సం॥


4. వ్యభిచారులు - నరహంతకులు పోకిరి చేష్టలు డాంబికులు
  అబద్దజనకుని యాసనము - యెజెబెలు నీయొద్ద నివసించెనా
  కృపావరములు ఆత్మభారములు - ఉజ్జీవ దాహము కలదా ||ఓ సం||


5. చల్లగనైన వెచ్చగను - వుండిన నీకది మేలగును - నులివెచ్చని
  స్థితి నీకుండిన - బయటకు ఉమ్మివేయబడెదవేమో-నీ మనస్సు మార్చుకో
  తొలి ప్రేమకూర్చుకో - ఆసక్తితో రక్షణపొందుమా ||ఓ సం||


6. కడపటి బూర మ్రోగగనే - కనురెప్పపాటున మారుదువా
    వడిగా మేఘాసీనుడవై - నడియాకాశము పోగలవా - గొట్టెపిల్ల సంఘమా
    క్రీస్తు రాజు సంఘమా రారాజు నెదుర్కొనగలవా ||ఓ సం||

ఓ దేవ నేను నీ - దాపున

ఓ దేవ నేను నీ - దాపున నుండెదన్ - నీ దాపున నుండెదన్
నా దేవ నను లేపు - నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట


1. బాటసారి లాగు - నేడు భానుడు గ్రుంకి - మేటి చీకటి
  గ్రమ్మినన్ = నేటి విశ్రాంతికి జోటు బండయైనన్
  మాటిమాటికి గలలో నూటిగా నిను దలతు


2. ఆకాశ మండల - మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా
    నీ కూర్మిచే నాకు - జేకూరు నంతయు లోకేశ్వరా -దూతలే కోరి నను బిలువ


3. నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో
    భీకరము లైన-శోకంబులను రాళ్లన్ నీకు నాలయంబు - నేగట్టెదను గర్తా


4. సంతసంపు రెక్క - లెత్తి నాకమునందు- నెంత పైకి లేచినన్
  వింతగ జ్యోతుల - వితతి మించి నేన- త్యంత మెగసినను
  నీ - చెంత కేగును బాట

ఓ క్రైస్తవా నీ వాస్తవాలు

ఓ క్రైస్తవా నీ వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా
దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా


1. ఈలోక అర్హతలెన్నున్న గానీ నీకున్న సంపదమిన్నైనా గానీ
    ఈ లోక త్రాసులో సరితూగినా సరితూగగలవా ప్రభు త్రాసులో.. ఆ తీర్పులో


2. యేసు కంకితము కాని ఏ జీవితమైనా ఎంతెంతగా ఏడ్చి రోధించినా
    కాలేదు దేవుని ప్రేమకు పాత్రం- మించెను సమయం లేదిక ప్రాప్తం.. ఆ తీర్పులో

Friday, 26 December 2025

ఓ సంఘమా సర్వాంగమా

 ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా

యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా

ఓ సంఘమా వినుమా

రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము (2)
పొందితినే యేసునందు (2)       ||ఓ సంఘమా||

క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)
సహియింతువా తీర్పునాడు (2)       ||ఓ సంఘమా||

చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)
సజీవముగా నున్నావా (2)       ||ఓ సంఘమా||

చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)
ఆసక్తితో రక్షణ పొందుమా (2)       ||ఓ సంఘమా||


ఓ మానవా.. నీ పాపం మానవా

ఓ మానవా.. నీ పాపం మానవా

యేసయ్య చెంత చేరి

నీ బ్రతుకు మార్చవా" (2)

పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము

పాపములోనే మరణించినచో తప్పదు నరకము. (2)   ||ఓ మానవా||

ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. (2)   ||ఓ మానవా||

ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును. (2)  ||ఓ మానవా||


ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

 "ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము

ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది" (2)  ||ఓ యేసు||

అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు. (2)     ||ఓ యేసు||

సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి. (2)        ||ఓ యేసు||

కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు. (2)         ||ఓ యేసు||

దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్. (2)     ||ఓ యేసు||


ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు

 "ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు

బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో".

సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము.

ఓ దూతలారా – ఉత్సాహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో.

యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ
ఈ వేల స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య – మాయే నర రూప
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో.


ఓ ప్రార్ధనా సుప్రార్ధనా

ఓ ప్రార్ధనా సుప్రార్ధనా"

నీ ప్రాభావంబున్ మరతునా

నా ప్రభువున్ ముఖా ముఖిన్

నే బ్రణుతింతు నీ ప్రభన్

నా ప్రాణమా సు ప్రార్ధనా

నీ ప్రేరణంబుచే గదా

నీ ప్రేమధార గ్రోలుదు

నో ప్రార్ధనా సుప్రార్ధనా

పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్ధనా

నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబు గొంచు బోవును
సదా శుభంబు లొందను
విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా
సుధా సుధార ప్రార్ధనా

అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్ధనా


ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా… ఓ ప్రభువా…

నీవే నా మంచి కాపరివి". (4)   ||ఓ ప్రభువా||

దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి. (2)
నిత్య జీవము నిచ్చిన దేవా. (2)
నీవే నా మంచి కాపరివి. (4)    ||ఓ ప్రభువా||

నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక. (2)
అంతము వరకు కాపాడు దేవా. (2)
నీవే నా మంచి కాపరివి. (4)     ||ఓ ప్రభువా||

ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో. (2)
నన్ను నీవు మరువని దేవా. (2)
నీవే నా మంచి కాపరివి. (4)    ||ఓ ప్రభువా||


ఓరన్న… ఓరన్న

ఓరన్న…  ఓరన్న

యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా"    ||ఓరన్న||

చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా. (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును. (2)           ||ఓరన్న||

పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా. (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను. (2)         ||ఓరన్న||

సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న. (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును. (2    ||ఓరన్న||


Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...