నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా

నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని

1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము- హాయిగా నచటుండెదను  ll నీ పాద ll

2. ప్రార్థించ మంటివి ప్రభువా - సంకట సమయములో
దయజూపి నను కరుణించి- ప్రేమతో ఆదరించుమయా ll నీ పాద ll

3. నరమాత్రుడవు నీవు గావు - మొర నాలకించుము
మనసార ప్రార్థించుచు - యేసు నీ దరి చేరెదను      ll నీ పాద ll

4. నన్ను చేయ విడువకు నాధా నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంతా - నీ బలము నాకిమ్ము          ll నీ పాద ll

5. ఆశతో నీ ముఖమును ఆసక్తితో నేను చూడ
సిగ్గు పడనుగా నేను - నీ ప్రకాశం నాపై నుండ       ll నీ పాద ll

6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము      ll నీ పాద ll

7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము
ఫలియించి వర్థిల్లుటకై - ప్రభువా నీ కృపనిమ్ము   ll నీ పాద ll

8. సీయోను మూలరాయి యైయ్యున్న ఓ ప్రభువా
కలతలు చెందక నేను - నీకై కనిపెట్టెదను         ll నీ పాద ll Nee paada sannidhiki krupaamayaa yesayyaa Nee prema kanugonuchu - devaa ne vachchitini 1. vishraanti nichchedu devaa - shramalella teerchumayyaa Siluvaye naa aashrayamu- haayigaa nachatundedanu ll nee paada ll 2. praarthincha mantivi prabhuvaa - sankata samayamulo Dayajoopi nanu karuninchi- premato aadarinchumayaa ll nee paada ll 3. naramaatrudavu neevu gaavu - mora naalakinchumu Manasaara praarthinchuchu - yesu nee dari cheredanu ll nee paada ll 4. nannu cheya viduvaku naadhaa nindalenno pondinanu Neekai sahinchedanantaa - nee balamu naakimmu ll nee paada ll 5. aashato nee mukhamunu aasaktito nenu chooda Siggu padanugaa nenu - nee prakaasham naapai nunda ll nee paada ll 6. shatruvu nodinchutaku - nee shaktini choopu Nannaadarinchi neevu - aavarinchi kaapaadumu ll nee paada ll 7. jeevinchi edugunatlu - jaya jeevitambimmu Phaliyinchi varthillutakai - prabhuvaa nee krupanimmu ll nee paada ll 8. seeyonu moolaraayi yaiyyunna o prabhuvaa Kalatalu chendaka nenu - neekai kanipettedanu ll nee paada ll


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు