నీ స్వరము వినిపించు ప్రభువా

నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాలకించున్. (2)
నీ వాక్యమును నేర్పించు - దాని యందు నడుచునట్లు నీతో    ||నీ స్వరము||

1.ఉదయమునే లేచి – నీ స్వరము వినుట - నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు - రక్షించు ఆపదలనుండి - (2)   ||నీ స్వరము||

2.నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు - నేను సరి చేసికొందు
నీ మార్గములో – నడుచునట్లుగా - నేర్పించుము ఎల్లప్పుడూ – (2)  ||నీ స్వరము||

3.భయ భీతులలో – తుఫానులలో - నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా - ధైర్య పరచుము నన్ను – (2)     ||నీ స్వరము||

4.నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో – సరిచేసికొందు - నీ దివ్య వాక్యము ద్వారా – (2)  ||నీ స్వరము||

5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది - అది రెండుచులు గల ఖడ్గo
నీ వాక్యమేగ అద్బుత అద్దం - నిజస్వరూపమును చూపించున్  – (2)    ||నీ స్వరము||

6. నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా - నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో - నీ యందు నిలచునట్లు – (2)  ||నీ స్వరము||

7.  నా హృదయములోని – చెడు తలంపులను - చేధించు నీ వాక్యము
నీ రూపమునకు – మార్చుము నన్ను  నీదు మహిమ కొరకేగా – (2)   ||నీ స్వరము|| Nee svaramu vinipinchu prabhuvaa - nee daasudaalakinchun. (2) Nee vaakyamunu nerpinchu - daani yandu naduchunatlu neeto ||nee svaramu|| 1.udayamune lechi – nee svaramu vinuta - naaku ento madhuramu Dinamantati koraku - nanu siddhaparachu - rakshinchu aapadalanundi - (2) ||nee svaramu|| 2.nee vaakyamu chadivi – nee svaramu vinuchu - nenu sari chesikondu Nee maargamulo – naduchunatlugaa - nerpinchumu ellappudoo – (2) ||nee svaramu|| 3.bhaya bheetulalo – tuphaanulalo - nee svaramu vinipinchumu Abhayamu nimmu – o goppa devaa - dhairya parachumu nannu – (2) ||nee svaramu|| 4.naato maatlaadu – spashtamugaa prabhuvaa - nee svaramu naa korake Neeto manushyulato – sarichesikondu - nee divya vaakyamu dvaaraa – (2) ||nee svaramu|| 5. nee vaakyamu agni sutte vantidi - adi renduchulu gala khadgao Nee vaakyamega adbuta addam - nijasvaroopamunu choopinchun – (2) ||nee svaramu|| 6. nerchukunnaanu – naa shramala dvaaraa - nee vaakyamunu ento Nannunchumu prabhuvaa – nee vishvaasyatalo - nee yandu nilachunatlu – (2) ||nee svaramu|| 7. naa hrudayamuloni – chedu talampulanu - chedhinchu nee vaakyamu Nee roopamunaku – maarchumu nannu - needu mahima korakegaa – (2) ||nee svaramu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు