నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు.  (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా.  (2)

1.నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి.  (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి.  (2)    ||నా జీవిత||

2.నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి.  (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి.  (2)   ||నా జీవిత||

3.నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి.  (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు.  (2)  ||నా జీవిత|| Naa jeevita bhaagasvaamivi neevu Naa praanamuto penavesukunnaavu neevu. (2) Naake samruddigaa nee krupanu panchaavu Naa yesuraaja krupaasaagaraa ananta stotraarhudaa. (2) 1.nee dayagala kanusaigale dhairyaparachinavi Nee adugujaadale naaku trovanu choopinavi. (2) Nee raajya paurunigaa nannu maarchitivi Nee sainyamulo nannu cherchitivi. (2) ||naa jeevita|| 2.nee dayagala maatale cheradeesinavi Neeti niyamaalalo nannu nadipinchuchunnavi. (2) Nee krupane dhvajamuga naapaina nilpitivi Nee vindushaalaku nanu cherchitivi. (2) ||naa jeevita|| 3.nee dayagala talampule roopunichchinavi Needu hastamule nannu nirminchuchunnavi. (2) Nee chittame naalo neraverchuchunnaavu Nee antahpuramulo nanu cherchuduvu. (2) ||naa jeevita||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు