నిజమైన ద్రాక్షావల్లి నీవే

నిజమైన ద్రాక్షావల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే.   (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ-ఎనలేని నీ ప్రేమ.  (2)   ||నిజమైన||

1.అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా,  (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా.  (2)   ||నిజమైన||

2.నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా.  (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా.  (2)  ||నిజమైన||

3.షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో.  (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో.  (2)   ||నిజమైన|| Nijamaina draakshaavalli neeve - nityamaina santoshamu neelone. (2) Shaashvatamainadi ento madhuramainadi Naapaina neekunna prema-enaleni nee prema. (2) ||nijamaina|| 1.ati kaankshaneeyudaa divyamaina nee roopulo Jeevinchunnaanu nee premaku ne patrikagaa, (2) Shidhilamai yundagaa nannu needu raktamuto kadigi Nee polikagaa maarchinaave naa yesayyaa. (2) ||nijamaina|| 2.naa praana priyudaa shreshtamaina phalamulato Arpinchuchunnaanu sarvamu neeke arpanagaa. (2) Vaadiponivvaka naaku aashrayamaitivi neevu Jeevapu ootavai balaparachitivi naa yesayyaa. (2) ||nijamaina|| 3.shaalemu raajaa ramyamaina seeyonuke Nanu nadipinchumu nee chittamaina maargamulo. (2) Alasi ponivvaka nannu needu aatmato nimpi Aadarana kartavai nanu cherchumu nee raajyamulo. (2)||nijamaina||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు