నీ వాక్యమే నన్ను బ్రతికించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను - బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా -
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. (2) ||నీ వాక్యమే||
1.జిగటగల ఊభినుండి లేవనెత్తెను -
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. (2)
నా పాదములకు దీపమాయెను. (2) -
సత్యమైన మార్గములో నడుపుచుండెను. (2) ||నీ వాక్యమే||
2.శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై -
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను. (2) -
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది. (2) ||నీ వాక్యమే||
3.పాలవంటిది జుంటి తేనె వంటిది -
నా జిహ్వకు మహా మధురమైనది. (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది. (2) -
రత్న రాసులకన్నా కోరతగినది. (2) ||నీ వాక్యమే||
Nee vaakyame nannu bratikinchenu -
baadhalalo nemmadinichchenu (2)
Krupaa shakti dayaa satya sampoornudaa -
vaakyamai unna yesu vandanamayyaa. (2) ||nee vaakyame||
1.jigatagala oobhinundi levanettenu -
samatalamagu bhoomipai nannu nilipenu. (2)
Naa paadamulaku deepamaayenu. (2) -
satyamaina maargamulo nadupuchundenu. (2) ||nee vaakyame||
2.shatruvulanu edurkone sarvaanga kavachamai -
yuddhamunaku siddha manasu ichchuchunnadi. (2)
Apavaadi veyuchunna agni baanamulanu. (2) -
khadgamu vale addukoni aarpi veyuchunnadi. (2) ||nee vaakyame||
3.paalavantidi junti tene vantidi -
naa jihvaku mahaa madhuramainadi. (2)
Melimi bangaaru kanna minna ayinadi. (2) -
ratna raasulakannaa korataginadi. (2) ||nee vaakyame||
Comments
Post a Comment