నడిపించు నా నావా

నడిపించు నా నావా - నడి సంద్రమున దేవా

నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప.      ||నడిపించు||


1.నా జీవిత తీరమున - నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ చేకొనుము.     ||నడిపించు||

2.రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ ర- మణీయ లోతులలో
రతణాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ.       ||నడిపించు||

3.ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేద - నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడే నావలలు .          ||నడిపించు||

4.ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట.    ||నడిపించు||

5.లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న - యీవులలో లోటైన నా బ్రతుకు
లోపించని యర్పణగా - లోకేశ  చేయుమయ.      ||నడిపించు||

6.ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు.  ||నడిపించు||


Nadipinchu naa naavaa - nadi sandramuna devaa Nava jeevana maargamuna - naa janma tariyimpa. ||nadipinchu|| 1.naa jeevita teeramuna - naa apajaya bhaaramuna Naligina naa hrudayamunu - nadipinchumu lotunaku Naa yaatma virabooya - naa deeksha phaliyimpa Naa naavalo kaalidumu - naa seva chekonumu. ||nadipinchu|| 2.raatrantayu shramapadinaa - raaledu prabhu jayamu Rahadaarulu vedakinanoo - raadaayenu pratiphalamu Rakshinchu nee siluva ra- maneeya lotulalo Ratanaalanu vedakutalo - raajillu naa padava. ||nadipinchu|| 3.aatmaarpana cheyakaye - aashinchiti nee chelimi Ahamunu preminchuchune - arasiti prabhu nee kalimi Aasha niraashaaye aaveda - neduraaye Aadhyaatmika lemigani - allaade naavalalu . ||nadipinchu|| 4.prabhu maargamu vidachitini - praarthinchuta maanitini Prabhu vaakyamu vadalitini - paramaarthamu marachitini Prapancha natanalalo - praaveenyamunu bondi Phalaheenudanai yipudu - paatintu nee maata. ||nadipinchu|| 5.lotaina jalamulalo - lotuna vinabadu svaramaa Lobadutanu nerpinchi - lopambulu savarinchi Lonunna - yeevulalo lotaina naa bratuku Lopinchani yarpanagaa - lokesha cheyumaya. ||nadipinchu|| 6.prabhu yesuni shishyudanai - prabhu premalo paadukoni Prakatintunu lokamulo - parishuddhuni prema katha Paramaatma prokshanato - paripoorna samarpanato Praanambunu prabhu koraku - paanaarpanamu jetu. ||nadipinchu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

స్థిరపరచువాడవు బలపరచువాడవు