నూతన పరచుము దేవా

నూతన పరచుము దేవా - నీ కార్యములు నా యెడల  (2)

సంవత్సరాలెన్నో జరుగుచున్నను - నూతనపరచుము నా సమస్తము.  (2)

పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును

నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును.  ||నూతన||


1.శాశ్వతమైనది నీదు ప్రేమ - ఎన్నడైన మారనిది నీదు ప్రేమ.  (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా -
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే.  (2)     ||పాతవి||

2.ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో - నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో.  (2)
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము.  (2)    ||పాతవి|| Nootana parachumu devaa - nee kaaryamulu naa yedala (2) Sanvatsaraalenno jaruguchunnanu - nootanaparachumu naa samastamu. (2) Paatavi gatinchipovunu – samastam nootanamagunu Neelo utsahinchuchu – neekai eduru chootunu. ||nootana|| 1.shaashvatamainadi needu prema - ennadaina maaranidi needu prema. (2) Dinamulu gadachinaa sanvatsaraalenni dorlinaa - Naa yeda needu prema nityam nootaname. (2) ||paatavi|| 2.prati udayam nee vaatsalyamuto - nannu edurkonduvu needu karunato. (2) Taramulalo ilaa santoshakaaranamugaa Nannila chesinaavu neeke stotramu. (2) ||paatavi||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు