Saturday, 2 May 2026

ఆత్మ స్వరూపుడా - మా యేసువా

ఆత్మ స్వరూపుడా - మా యేసువా - నీ ఆత్మతో మము నింపుమా 

నీ ఆత్మ శక్తిని మా కొసగుమా (2)


అ.ప.    పరిశుద్ధాత్మ దేవుడా - నీ ఆత్మతో నింపుమా

            పరిశుద్ధాత్మ దేవుడా - నీ అగ్నిని పంపుమా

            పరిశుద్ధాత్మ దేవుడా - మా పెదవులు కాల్చుమా

           పరిశుద్ధాత్మ దేవుడా - పరిశుద్ధత నీయుమా


1. మండుచున్న పొదలో అగ్నివై - భక్తుడు మోషేను దర్శించిన దేవా 

కర్మెలు గిరిపై బలి అర్పణపై - దహించు అగ్నిగా దిగిన దేవా 

మమ్మును దర్శించుమా - మాపై దిగిరమ్మయా (2)            ||పరి||


2. ఆది సంఘములో నీ శిష్యులపై- ఆత్మ శక్తిని కుమ్మరించితివి 

నీ కార్యములు గంభీరముగా - జరిగించుటకు మమ్మును స్థిరపరచుము 

ఆత్మను వెలిగించుమా - శక్తిని దయచేయుమా (2)             ||పరి||


3. అంత్యకాలమున మనుష్యులందరిపై- పరిశుద్ధాత్మను నిశ్చయించితివి 

యెరూషలేము యూదయ సమరయ - భూదిగంతముల సాక్షులై 

యుందుము - వాగ్దానం నెరవేరగా -  ఆత్మశక్తితో నింపుమా    ॥పరి||

No comments:

Post a Comment

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...