ఆ కాశంబు భూమియు
1. ఆకాశంబు భూమియు - అంతట చీకటి యాయెను =
ప్రాకెడు చీకటి సమయమున - ప్రార్ధన చేతుము మా దేవా
2. చక్కని చుక్కలు మింటను చక్కగ మమ్మును జూడగ =
ప్రక్కకు రావే వేగముగా - ప్రభువా గావుము నీ నీడన్
3. చిన్న చిన్న పక్షులు - చిన్న చిన్న పూవులు =
ఎన్నో ఎన్నో జీవులు - నిన్నే గొలిచి నిద్రించున్
4. చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలో =
చిన్ని కన్నులు మూయంగా చెన్నుగ యేసూ గావుమా
5. నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో =
గాలి విమానంబులలోన - కావుము దేవ ప్రయాణికులన్
6. రాత్రిలో నీదు దూతలు-రమ్యంబైన రెక్కలతో =
చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్- నిద్రించెదము మా దేవా
7. తెల్లవారుజామున తెలివొంది మే మందరము =
మెల్లగలేచి నుతియింపన్ - మేల్కొల్పుము మా ప్రియ తండ్రి
8. జనక తనయా శుద్ధాత్మా - జయము మహిమ స్తోత్రములు =
అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్
1. aakaashambu bhoomiyu - antata cheekati yaayenu = praakedu cheekati samayamuna - praardhana chetumu maa devaa 2. chakkani chukkalu mintanu chakkaga mammunu joodaga = prakkaku raave vegamugaa - prabhuvaa gaavumu nee needan 3. chinna chinna pakshulu - chinna chinna poovulu = enno enno jeevulu - ninne golichi nidrinchun 4. chinni chinni paapalu chinni chinni padakalalo = chinni kannulu mooyangaa chennuga yesoo gaavumaa 5. nelanu boyedi bandlalo neetanu boyedi odalalo = gaali vimaanambulalona - kaavumu deva prayaanikulan 6. raatrilo needu dootalu-ramyambaina rekkalato = chitrambuga mammunu gramman- nidrinchedamu maa devaa 7. tellavaarujaamuna telivondi me mandaramu = mellagalechi nutiyimpan - melkolpumu maa priya tandri 8. janaka tanayaa shuddhaatmaa - jayamu mahima stotramulu = anishamu neeke chellunugaa anishamu chellunu nee kaamen
Comments
Post a Comment