ఆధారం నీవేనయ్యా
“ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా
మాయా లోకములోనే తలక్రిందులైపోగా” (2). ||ఆధారం||
1.మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ (2)
పరులకు లెక్కెంతయ్యా
అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా
అల్పునకు. ||ఆధారం||
2.నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు (2)
నడి యేట వీడిరయ్యా
ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా
ఏకాంతునకు. ||ఆధారం||
3.శోధనలెగసి – వేదన వెన్నంటి (2)
దుఃఖం పొంగే వేళలో
నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో
నీ దాసునకు. ||ఆధారం||
4.విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం (2)
నిండు కృపానిధియే
నా విభుడా.. నిండు కృపానిధియే
నా విభుడా. ||ఆధారం||
5.ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా (2)
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా (2) నా దేవా. ||ఆధారం||
6.నీ దీప స్థంభమై నేను - జీవించ చిరకాల ఆశ (2)
నీ దరికి చేరి నను నీకర్పించి
సాక్షిగ జీవింతును (2). ||ఆధారం||
7.నీ రాయబారినై నేను - ధైర్యంగా జీవించ ఆశ (2)
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును (2). ||ఆధారం||
“aadhaaram neevenayyaa
Naa prabhuvaa… aadhaaram neevenayyaa
Maayaa lokamulone talakrindulaipogaa” (2). ||aadhaaran||
1.maataa pitale nannu – heenangaa choochuchunda (2)
Parulaku lekkentayyaa
Alpunipai.. parulaku lekkentayyaa
Alpunaku. ||aadhaaran||
2.naa todu neevanna – neeti prabodhakulu (2)
Nadi yeta veedirayyaa
Ekaantunigaa… nadi yeta veedirayyaa
Ekaantunaku. ||aadhaaran||
3.shodhanalegasi – vedana vennanti (2)
Duhkham ponge velalo
Naa sukrutamaa.. duhkham ponge velalo
Nee daasunaku. ||aadhaaran||
4.vidvaansula shikharam – vidutula nestam (2)
Nindu krupaanidhiye
Naa vibhudaa.. nindu krupaanidhiye
Naa vibhudaa. ||aadhaaran||
5.aadhaaram neevenayyaa
Naaku aadhaaram neevenayyaa (2)
Kaalamu maarinaa kashtaalu teerinaa
Kaaranam neevenayyaa (2) naa devaa. ||aadhaaran||
6.nee deepa sthambhamai nenu - jeevincha chirakaala aasha (2)
Nee dariki cheri nanu neekarpinchi
Saakshiga jeevintunu (2). ||aadhaaran||
7.nee raayabaarinai nenu - dhairyangaa jeevincha aasha (2)
Nissvaardhamuganoo tyaagamutonoo
Ninu nenu prakatintunu (2). ||aadhaaran||
Comments
Post a Comment