ఆశ్చర్యమే మహాద్భుతమే
ఆశ్చర్యమే మహాద్భుతమే - ఆనంద సాగరము
ఎవరు మారినను మారనివాడు- నేడు నిరంతరము నా ప్రభువు
1. శోధనలు ప్రవాహమువలె పెరిగి - ప్రాణాన్ని కృంగజేయును
క్రీస్తేసే బండయై నా పాదములకు - ఆధారమాయెనుగా llఆశ్చll
2. బేధములు పలు విమతములు పెను - గాలివలె వీచగా విశ్వాస
నావను గురి తప్పనీయక - యేసే లంగరాయెను llఆశ్చll
3. నే నమ్మినవాడు తన నేత్రములను - నా మీదనే నిలిపి
నిరీక్షణతోను మహా ధైర్యముతోను - కాచె నేటివరకు ॥ఆశ్చII
4. పూర్ణ శుద్ధినొందిన పరిశుద్దులు - పొందు బహుమతికి
ప్రత్యేకపరచి నన్నును చేర్చెను - ప్రియుని స్వాస్థ్యముగా llఆశ్చll
5. ప్రభుని రాకడ దినమున మనము - ప్రియునివలె మారెదం
మృత్యువు దుఃఖము కన్నీరుతొలగును - మహామహుని గాంచగా llఆశ్చll aashcharyame mahaadbhutame - aananda saagaramu evaru maarinanu maaranivaadu- nedu nirantaramu naa prabhuvu 1. shodhanalu pravaahamuvale perigi - praanaanni krungajeyunu kreestese bandayai naa paadamulaku - aadhaaramaayenugaa llaashchall 2. bedhamulu palu vimatamulu penu - gaalivale veechagaa vishvaasa naavanu guri tappaneeyaka - yese langaraayenu llaashchall 3. ne namminavaadu tana netramulanu - naa meedane nilipi Nireekshanatonu mahaa dhairyamutonu - kaache netivaraku ॥aashchaII 4. poorna shuddhinondina parishuddulu - pondu bahumatiki pratyekaparachi nannunu cherchenu - priyuni svaasthyamugaa llaashchall 5. prabhuni raakada dinamuna manamu - priyunivale maaredam mrutyuvu duhkhamu kanneerutolagunu - mahaamahuni gaanchagaa llaashchall
Comments
Post a Comment