అరణ్యమును ఎండిన భూమియు - ఆ ప్రభుని ఆరాధించును
కస్తూరివలె పూయును - సంగీతమే పాడును
క్రీస్తు రాజును స్తుతులతోడను - కీర్తించి కొనియాడుము
హల్లెలూయ - హల్లేలూయ (2) II హల్లె II
1. లెబనోను సౌందర్యము పొందును- కర్మెలు షారోను సొగసొందును
దేవుని తేజస్సు చూపించును -జీవన జీవము నందించును II హల్లె II
2. సడలిన చేతులు బలపర్చుడి - తొట్రిల్లు కాళ్ళను ధృడపర్చుడి
బిత్తర చెందక యోచించుడి-తత్తర హృదయాలు వెలుగించుడి II హల్లె II
3. గ్రుడ్డివారి కన్నులు తెరువబడును- చెవిటివారి చెవులు విప్పబడును
కుంటివాడు దుప్పివలె గంతులేయును-మూగవాని నాలుక స్తోత్రించును II హల్లె II
4. ఎండిన హృదయాలు ఉల్లసించును - ఆనంద హృదయాలై
సంతోషించును ప్రభు నామమునే ప్రణుతించును
పరమున ప్రభుతో నిత్యముండును. II హల్లె II
No comments:
Post a Comment